What Is the Story Behind Engineering Student Naveen Case
mictv telugu

Engineering Student Naveen Case :నవీన్ హత్య కేసు.. ట్రయాంగిల్ రక్తచరిత్ర A to Z

March 7, 2023

Engineering Student Naveen Case : What Is the Story Behind Engineering Student Naveen Case

హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్లో జరిగిన బీటెక్‌ విద్యార్థి నవీన్‌ హత్య కేసు ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రియురాలి కోసం స్నేహితుడిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. పరిపక్వత లేని వయస్సులో ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం.. వెరసి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఓ అమ్మాయి ప్రేమ ఇద్దరి స్నేహితుల మధ్య పెట్టిన చిచ్చు.. హత్యకు దారి తీయడంపై రాష్ట్రమంతా తీవ్ర చర్చనీయాంశమైంది. హత్య జరిగినప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 17 నుంచి ఇప్పటి వరకూ ఈ కేసులో ప్రతిరోజూ ఏదో ఒక సంచలన విషయం బయటపడుతున్నది.

Engineering Student Naveen Case : What Is the Story Behind Engineering Student Naveen Case

వీరంతా అక్కడే పరిచయం

నాగర్‌కర్నూల్‌ జిల్లా చారగొండ మండలం సిరిసనగండ్లకు చెందిన నేనావత్‌ నవీన్‌ (22), వరంగల్‌కు చెందిన హరిహరకృష్ణ దిల్‌సుఖ్‌నగర్‌ ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ చదివారు. హైదరాబాద్ కు చెందిన నిహారిక అనే అమ్మాయి కూడా వారితోపాటే అక్కడ చదివింది. అనంతరం నవీన్‌కు ఇంజినీరింగ్‌లో సీటు లభించడంతో నల్లగొండ ఎంజీ యూనివర్సిటీలో జాయిన్‌ కాగా, హరిహరకృష్ణ పీర్జాదిగూడలోని ఓ కాలేజీలో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్‌లో ఉన్నప్పుడే నవీన్‌కు, నిహారికకు పరిచయం. ఇద్దరు కొంతకాలం చనువుగా ఉన్నారు. నవీన్ ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఇదే సమయంలో హరిహరకృష్ణ ఆ యువతికి దగ్గరయ్యాడు. విషయం తెలుసుకొన్న నవీన్‌ మళ్లీ యువతితో మాట్లాడటం ప్రారంభించాడు. నవీన్‌ ఆ యువతికి దగ్గరవుతుండటంతో హరిహరకృష్ణ భరించలేకపోయాడు. ఈ విషయంపై స్నేహితులిద్దరు పలుమార్లు గొడవపడ్డారు. నవీన్‌ మళ్లీ దగ్గరైతే యువతి తనకు దూరమైపోతుందేమోనన్న అక్కసుతో ఎలాగైనా అంతమొందించాలని హరిహరకృష్ణ పక్కాగా స్కెచ్‌ వేశాడు.

Engineering Student Naveen Case : What Is the Story Behind Engineering Student Naveen Case

గెట్‌ టు గెదర్‌ పార్టీకి పిలిచి

గత నెల 16న ఇంటర్మీడియెట్‌ ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేశారని, అందుకు తప్పకుండా రావాలని హరిహరకృష్ణ నవీన్‌కు చెప్పాడు. నవీన్ వచ్చాక అదే రోజున పక్కా ప్లాన్‌ ప్రకారం అతన్ని హత్య చేద్దామనుకున్నాడు. కానీ, ఆ రోజు నవీన్‌ రాలేదు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు హరిహరకు ఫోన్‌ చేసిన నవీన్.. అతణ్ని కలవడానికి హైదరాబాద్‌ వస్తున్నట్లు చెప్పాడు. ఫిబ్రవరి 17న ఎల్‌బీనగర్‌లో దిగినట్లు నవీన్‌ ఫోన్‌ చేయగా.. హరిహర, అతడిని మూసారాంబాగ్‌లోని తన ఫ్రెండ్ రూమ్‌కి తీసుకెళ్లాడు. సాయంత్రం తాను కాలేజీ హాస్టల్‌కు వెళ్లిపోతానని నవీన్‌ చెప్పడంతో ఆ రోజే హత్య చేద్దామని డిసైడ్ అయ్యాడు. సాయంత్రం వరకు స్నేహితుల గదిలో మాట్లాడుకొన్నారు. మాటల మధ్యలో ఆ అమ్మాయి ప్రస్తావన రావడంతో ఇద్దరూ గొడవపడ్డారు. వెంటనే నవీన్ తన తండ్రి శంకరయ్యకు ఫోన్‌ చేసి ఈ గొడవ గురించి చెప్పాడు. శంకరయ్య హరితో మాట్లాడటంతో అంతటితో ఆ గొడవ ఆగింది.

Engineering Student Naveen Case : What Is the Story Behind Engineering Student Naveen Case

షాపుకు మందుకొట్టి..

ఆ తర్వాత నవీన్‌తో బయటికెళ్దామని చెప్పి, అప్పటికే కొని పెట్టుకున్న కత్తి, గ్లౌజులను ఒక బ్యాగ్‌లో పెట్టుకుని, అతడితో కలిసి బయల్దేరాడు హరిహరకృష్ణ. బైక్‌పై నవీన్‌ను ఎక్కించుకుని.. దారిలో అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద వైన్‌షాప్ వద్ద ఆపాడు. అక్కడ ఇద్దరూ మద్యం సేవించారు. తాను రాత్రి 11గంటల సమయంలో.. హరిహర సెల్‌ఫోన్‌ ద్వారా.. ప్రేమించిన యువతికి నవీన్‌ ఫోన్‌ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మళ్లీ బైక్‌పై బయల్దేరారు. రామోజీ ఫిలిం సింటీ వద్ద యూ టర్న్‌ తీసుకుని వెనక్కివస్తూ.. తాను అనుకున్న చోటుకు వచ్చాక ప్రేమించిన యువతి ప్రస్తావన తెచ్చాడు. రోడ్డు నుంచి పక్కనున్న పొదల బాటలోకి బైకును మళ్లించి.. రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌ వద్దకు తీసుకెళ్లాడు. కసితో ఉన్న హరిహరకృష్ణ.. అక్కడే గుట్టల్లోకి తీసుకెళ్లి తనతో పాటు తెచ్చుకున్న కత్తితో నవీన్‌ను ఎక్కడపడితే అక్కడ పొడిచాడు.

ఫస్ట్ కాల్ ఆ అమ్మాయికే..

నవీన్ చనిపోయాడని నిర్థారించుకున్న తరువాత.. ఈ విషయాన్ని అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత ఒక్కో భాగం కోస్తూ.. ఆమెకు ఫోటోలు పంపాడు. ‘ఈ వేలే కదా నిన్ను తాకింది.. ఇదిగో’ అంటూ, ఈ గుండె కదా నిన్ను తాకింది.. అంటూ గుండెను కోసి, ఆ పిక్ ను అమ్మాయి ఫోన్‌కు పంపాడు. చివరకు నవీన్ తలని కోసి దూరంగా వేశాడు. ఇలా ఒక్కో భాగం కోస్తూ.. ఆ అమ్మాయికి మెసేజ్ లు పంపాడు. అయితే.. షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ మెసేజ్ లన్నింటికీ యువతి ఏమాత్రం భయపడకుండా.. సింపుల్ గా ‘అవునా.. ఓకే వెరీ గుడ్ బాయ్’ అంటూ రిప్లై ఇచ్చింది.
అయితే యూనివర్సిటీ నుంచి హైదరాబాద్ వచ్చిన నవీన్.. అదే రోజున అంటే ఫిబ్రవరి 17 న రాత్రి 8 గంటలకు హాస్టల్‌ ఫ్రెండ్ ప్రదీప్‌కు ఫోన్‌ చేశాడు. ‘రావడానికి ఆలస్యం అవుతుంది. అన్నం తీసి పెట్టు’ అని చెప్పాడు. ఎంతకూ రాకపోవడంతో 9.30కు ప్రదీప్‌ ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వచ్చింది. నవీన్‌ తిరిగి రాకపోవడంతో అతని స్నేహితులు ఆరా తీశారు. హరిహరకృష్ణతో కలిసి పార్టీ చేసుకొన్నట్టు తెలుసుకున్నారు. హరిహరకృష్ణకు కాల్ చేయగా.. ఏమీ ఎరుగనట్లు, చిన్న గొడవ జరిగిందని, దీంతో అబ్దుల్లాపూర్‌మెట్‌లో వదిలేసి వెళ్లానని చెప్పాడు.

మర్డర్ స్పాట్‌కు నిహారిక

హత్య తర్వాత హరిహర.. బ్రహ్మణపల్లిలోని స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లాడు. ఒక వ్యక్తిని చంపానని హాసన్‌కు చెప్పాడు. మృతుడి శరీర భాగాలను మాయం చేసేందుకు సాయం కోరాడు. ఇద్దరు కలిసి మృతుడు శరీర భాగాలను ప్లాస్టిక్ బ్యాగ్‌లో ప్యాక్ చేశారు. శివారు ప్రాంతాల్లోని మన్నెగూడ శివార్లలో వాటిని పడేశారు. అక్కడి నుంచే నిహారికకు, తన తండ్రికి కాల్ చేశాడు. మద్యం మత్తులో ఉన్న హరిహరను హాసన్ పోలీసుల ఎదుట లొంగిపొమ్మని చెప్పాడు. అదంతా తర్వాత చూద్దాం అంటూ అక్కడ రక్తపు మరకలతో ఉన్న షర్ట్ ను మార్చి, స్నానం చేసి ఆ రాత్రి అక్కడే గడిపాడు.

Engineering Student Naveen Case : What Is the Story Behind Engineering Student Naveen Case

పైసలు పంపింది..

ఆ మరుసటి రోజు 18న ఉదయం.. హసన్‌ ఇంటి నుంచి హస్తినాపురంలోని నీహారిక వద్దకు వెళ్లాడు. వరంగల్‌ వెళ్లేందుకు డబ్బులు కావాలని అడగడంతో ఆమె రూ.1500 అతడికి ట్రాన్స్‌ఫర్‌ చేసింది. తరువాత నుంచి హరిహరకృష్ణ.. నిత్యం హసన్‌తో, నీహారికతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. నవీన్‌ హత్య సంగతి తెలిసిన హరిహర తండ్రి ప్రభాకర్.. పోలీసులకు లొంగిపోవాలంటూ కుమారుడికి సూచించారు. కానీ, అతడు వరంగల్‌ నుంచి వైజాగ్‌ వెళ్లాడు. అక్కణ్నుంచీ 20వ తేదీ రాత్రి నగరానికి వచ్చి మళ్లీ నీహారికను కలిశాడు. ఆమెను తన బైక్‌పై ఎక్కించుకుని.. నవీన్‌ను హత్య చేసిన చోటుకు తీసుకెళ్లాడు. కొద్దిదూరం నుంచి అతడి మృతదేహాన్ని చూపించి.. హత్య ఎలా చేశాడో వివరించాడు. అక్కడి నుంచి వచ్చిన వీరిద్దరూ కలిసి రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేశారు. ఆ తర్వాత ఆరు రోజుల పాటు కోదాడ, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో తిరిగాడు. హత్య జరిగిన రోజే ఈ విషయం గురించి స్నేహితుడు హసన్‌కు, ప్రేయసి నిహారికకు, తండ్రి ప్రభాకర్ కు హరిహరకృష్ణ చెప్పాడు. అందరికీ తెలిసినా ఈ విషయాన్ని ఏ ఒక్కరూ పోలీసులకు చెప్పలేదు.

కాల్చి చంపేస్తారని భయపడి..

ఇంతలో నవీన్ నాలుగు రోజులుగా కాలేజీకి వెళ్లడం లేదని తండ్రి శంకరయ్యకు తెలిసింది. అనుమానం వచ్చి ఈ నెల 22న నార్కట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ రోజు తన కొడుకు ఫోన్ చేసిన విషయాన్ని కూడా చెప్పాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నవీన్‌ స్నేహితులను విచారించారు. ఈ విషయాలన్ని తెలుసుకొని ఎలాగైనా పట్టుబడుతానని, ఇలా దొరక్కుండా తిరిగితే పోలీసులు కాల్చిచంపేస్తారని భయపడి.. పోలీసులకు లొంగిపోవాలనుకున్నాడు.
గత నెల 24న తిరిగి వచ్చిన హరిహరకృష్ణ నిహారికతో పాటు స్నేహితుడు హాసన్‌ను కలిశాడు. ముగ్గురు కలిసి కలిసి మన్నెగూడ శివార్లకు వెళ్లి, అక్కడ అంతకుముందు పడేసిన నవీన్‌ శరీర భాగాలను తీసుకుని, తిరిగి మర్డర్‌స్పాట్‌కు వచ్చారు. ఆధారాలను మాయం చేయాలన్న కోణంలో ఆలోచించి వాటిలో కొన్ని భాగాలను తగలబెట్టారు. అనంతరం నీహారిక ఇంటికి వెళ్లారు. అక్కడే స్నానం చేశారు. ఆ సమయంలో నీహారిక ఇంట్లోవాళ్లు ఎవరూ లేకపోవడంతో కొద్దిసేపు అక్కడే ఉన్నారు. ఇక తమ మెసేజులు, కాల్‌ డేటా మొత్తం డిలీట్ చేసుకున్నారు. ‘ఆధారాలన్నీ మాయం చేశాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. నేను లొంగిపోయి.. ఒక్కణ్నే ఈ హత్య చేశానని ఒప్పుకొంటా’ అని హరిహర వారికి ధైర్యం చెప్పాడు. అనంతరం 24న రాత్రి.. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసుల ముందు లొంగిపోయాడు.

Engineering Student Naveen Case : What Is the Story Behind Engineering Student Naveen Case

విస్తుపోయే వాస్తవాలివీ..

ఇక విచారణ చేపట్టిన పోలీసులకి హరిహరకృష్ణ చెప్పిన సమాధానాలతో మైండ్ బ్లాంక్ అయింది. తన స్నేహితుడు నవీన్‌ను, తాను ప్రేమించే యువతి కోసం హత్య చేశానని నిజం ఒప్పుకున్నాడు. ఈ హత్య చేసేందుకు మూడు నెలల నుంచే ప్లాన్ వేశానని తెలిపాడు. ఓ షాపింగ్ మాల్‌లో రెండు నెలల క్రితమే కత్తిని కొనుగోలు చేశానని, దానిని స్కూటీలో పెట్టుకుని తిరిగానని చెప్పాడు. వెంటనే పోలీసులు నిందితుడిని తీసుకుని హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ నవీన్ మృతదేహం పూర్తిగా కూళ్లిపోయింది. శరీర భాగాలు గుండె తల, మొండెం, చేతి వేలు, మర్మాంగలు కత్తితో కోసి ఉన్నాయి. ఇంతటి హత్యను కూడా హరిహరకృష్ణ చాలా తేలికగా తీసుకున్నట్టు గుర్తించారు.

అబ్బే, నాకేమీ తెలియదు..

ఈ హత్యకు కారణమైన నిహారికను కూడా మూడు సార్లు పోలీసులు విచారించారు. ఎన్ని సార్లు చెప్పినా.. సమాధానం మాత్రం ఒకటే.. నాకేమీ తెలియదు. నన్ను ఈ కేసులోకి లాగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు. సఖి సెంటర్‌లో కౌన్సిలింగ్ ఇప్పించినా అమ్మాయి తీరు మారలేదు. కౌన్సిలింగ్ ఇప్పించినా, కుటుంబ సభ్యులు ఇంత బాధపడుతున్నా నిహారికలో ఇసుమంత కూడా పశ్చాత్తాపం లేదు. అయితే పోలీసులు తమదైన స్టైల్ లో ఆమెను చాలా తెలివిగా విచారించారు. ఆమె సాక్ష్యాలు దాచిందన్న విషయాన్ని ఫ్రూఫ్స్‌తో సహా నిర్ధారించుకున్నారు. క్రాస్ క్వశ్చన్స్‌తో చేయడంతో ఆమె దొరికిపోయింది. హత్య చేసిన తర్వాత నిజం ఎవరికీ చెప్పకుండా దాచినందుకు ఆమెను ఏ3గా చేర్చారు పోలీసులు. అటు హసన్‌ను కూడా ఇదే విషయంపై ఏ2గా చేర్చారు. హయత్‌ నగర్‌ కోర్టులో నిహారికాను నిన్న ప్రొడ్యూస్‌ చేశారు. కోర్టు ఆదేశాలతో నిహారికను చంచల్‌గూడ విమెన్ జైలుకు, హసన్‌ను చర్లపల్లి జైలుకు 14రోజుల రిమాండ్ కోసం తరలించారు.