అంధులకూ ఇంటర్నెట్! - MicTv.in - Telugu News
mictv telugu

అంధులకూ ఇంటర్నెట్!

August 22, 2017

ఇంటర్నెట్… చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచమే మన అరిచేతిలో ఉంటుంది. కానీ చూపులేని వారికి ఇంటర్నెట్ వాడడం కష్టం.  అయితే ఇప్పుడు వారూ ఇంటర్నెట్ ను సులభంగా వాడే విధంగా బెంగుళూరుకు చెందిన కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఓ  పరికరాన్ని రూపొందించారు. దీని పేరు స్పర్శ్.

ఈ స్పర్శ్ లో కూడా స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ లాగానే ఇంటర్నెట్ ను వాడుకోవచ్చట. ఇంటర్నెట్ లో వచ్చే డిజిటల్ డేటా మొత్తం ఈ పరికం ద్వారా బ్రెయిలీ లోకి మారిపోతుంది.  ఏదైనా టైప్ చేయాలన్నా బ్రెయిలీలో టైప్ చెయ్యచ్చు.

ఇంటర్నెట్ లో ఉన్న అక్షరాలను ఎంత వేగంతో చదవాలో కూడా నియంత్రించుకోవచ్చు. ఈ పరికరంలో అక్షరాలను ఆడియో రూపంలో కూడా వినే సదుపాయం ఉంది.  ఇది పూర్తిగా చూపులేని వారికోసం తయారుచేసిన పరికరమని, వారికి ఇది చాలా ఉపయోగ పడుతుందని చెబుతున్నారు.