పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. స్వదేశంలో మొదటిసారి వైట్ వాష్‌కు గురైంది. కరాచీ టెస్టులో ఇంగ్లాండ్‌పై ఓడిన పాక్.. సిరీస్ ను 0-3తో కోల్పోయింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్..ఆతిథ్య జట్టుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి క్లీన్ స్వీప్ చేసింది. చివరి టెస్ట్ కేవలం నాలుగోరోజు మొదటి బాగంలో ముగిసిపోయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ మొదటి ఇన్నింగ్స్ లో 304 పరుగులకు ఆలౌట్ అయింది. బాబర్ అజమ్ 78 పరుగులు, అఘా సల్మాన్ 56 పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 4, యువ బౌలర్ రెహాన్ అహ్మద్ 2 వికెట్లు దక్కించుకున్నారు. ఇక ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 354 పరుగులు చేసింది. మరోసారి హ్యారీ బ్రూక్ (111) సెంచరీతో రాణించాడు. 50 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్‌ను ఇంగ్లండ్ డెబ్యూ బౌలర్ రెహాన్ అహ్మద్ దెబ్బతీశాడు. అతి చిన్న వయసులో ఐదు వికెట్ల సాధించి. కొత్త చరిత్ర సృష్టించాడు. అతని ధాటికి పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకు కుప్పకూలింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 28.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. డకెట్ 82, జాక్ క్రాలే 41 పరుగులతో రాణించారు.
కొద్దిరోజులుగా టెస్ట్ క్రికెట్లో ఇంగ్లండ్ దూకుడు ప్రదర్శిస్తుంది. బజ్‌బాల్ స్ట్రాటజీతో ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది. ఇదే తరహా ఆటతో పాకిస్తాన్ కూడా వాళ్ల సొంతదేశంలోనే మట్టికరిపించి సిరీస్‌ను దక్కించుకుంది.