ఇవాళ వరల్డ్ కప్ మరో బిగ్ ఫైట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాళ వరల్డ్ కప్ మరో బిగ్ ఫైట్

July 11, 2019

England face acid test in semi-final clash with Australia.....

ప్రపంచ కప్‌లో భాగంగా ఈరోజు రెండవ సెమీఫైనల్‌కు రంగం సిద్దమైనది. ఫైనల్స్‌లో న్యజిలాండ్‌తో ఆడేదెవరో ఈరోజు తేలిపోనుంది. బర్మింగ్‌హామ్‌ వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్‌, 2015 ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియాలు తలపడబోతున్నాయి. వరుస విజయాలతో ఆస్ట్రేలియా సెమీస్‌లోకి దూసుకొని రాగా.. అతి కష్టం మీద ఇంగ్లండ్‌ సెమీస్‌కు చేరింది. 

చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాను ఎలాగైనా ఓడించాలనే ఇంగ్లాండ్ పట్టుదలతో ఉంది. ఏది ఏమైనా ఈరోజు ఆసక్తికర పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ వార్నర్‌, ఫించ్‌, స్టీవ్‌ స్మిత్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండగా.. బౌలర్లు స్టార్క్‌, కమిన్స్‌, స్టొయినిస్‌, బెహ్రెన్‌డార్ఫ్‌లు కూడా ఫర్వాలేదు అనిపిస్తున్నారు. ఇంగ్లండ్‌ జట్టు విషయానికి వస్తే జాసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో, జాయ్ రూట్‌, కెప్టెన్‌ మోర్గాన్‌, బట్లర్‌ సహా బ్యాట్స్‌మెన్‌ మొత్తం మంచి ఫార్మ్ లో ఉన్నారు. మార్క్‌ ఉడ్‌, ఆర్చర్‌, క్రిస్‌వోక్స్‌, స్టోక్స్‌లతో కూడిన బౌలింగ్‌ పటిష్టంగా ఉంది.