రావల్పిండిలో పాకిస్తాన్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో ఇంగ్లాండ్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. ఆ జట్టు బ్యాట్స్ మెన్స్ చెలరేగడంతో మొదటి రోజు ఆట ముగిసేసమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 506 పరుగులు చేసింది. ఇప్పటివరకు జట్టులో మొత్తం నలుగురు బ్యాటర్లు సెంచరీలు బాదేశారు. క్రాలే(122), డకెట్(107), పోప్(108), బ్రూక్ నాటౌట్ (101) సెంచరీలు సాధించారు. వన్డే తరహాలో రెచ్చిపోయిన ఇంగ్లాండ్ కేవలం 75 ఓవర్లలో 6.75 రన్ రేట్‌తో 506 పరుగులు సాధించింది.ప్రస్తుతం క్రీజ్‌లో బ్రూక్‌తో పాటు స్టోక్స్ (15 బంతుల్లో 34) ఉన్నాడు.
భారత్ రికార్డు బద్ధలు కొట్టిన ఇంగ్లాండ్..
ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించిన ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. తొలి సెషన్లో ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా వరల్డ్ రికార్డు సృష్టించింది. 27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 174 పరుగులు చేసి.. తొలి సెషన్లో అత్యధిక పరుగులు చేసిన భారత్ రికార్డును చెరిపివేసింది. 2008లో అఫ్గానిస్థాన్‌పై టీమిండియా తొలి సెషన్లో 150 రన్స్ చేసింది.
6 బంతుల్లో 6 ఫోర్లు..
రూట్ అవుట్ అయ్యాక క్రీజ్ లోకి వచ్చిన బ్రూక్ చెలరేగాడు. కేవలం 81 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు. 68 ఓవర్లో అతడు విధ్వంసం సృష్టించాడు. సౌద్ షకీల్ వేసి ఆ ఓవర్లో వరుసుగా ఆరు ఫోర్లు బాదాడు. టెస్టుల్లోనూ టీ20 స్థాయిలో రెచ్చిపోయాడు.