England team's key decision..donation will be provided
mictv telugu

ఇంగ్లండ్ జట్టు కీలక నిర్ణయం..సాయం అందిస్తాం

September 16, 2022

పాకిస్తాన్‌ ప్రస్తుతం భారీ వరదలతో అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి క్లిష్ట సమయంలో పాక్ గడ్డపై పాకిస్తాన్-ఇంగ్లండ్ జట్ల మధ్య టి20 సిరీస్ జరుగనుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌కు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం మ్యాచ్‌ల్లో గెలిచిన ప్రతి రూపాయిని డొనేషన్ రూపంలో వరద బాధితులకు అందేలా చూస్తామని ఇంగ్లండ్ జట్టు ప్రకటించింది.

”ఒక జట్టుగా గెలుపోటములు పక్కనబెడితే..మ్యాచ్‌కు సంబంధించిన డొనేషన్‌ను వరద బాధితులకు అందేలా చూస్తాం. ఇందుకోసం ఈసీబీతో ఇప్పటికే మాట్లాడాము. ఈసీబీ కూడా మా వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని, పెద్ద మొత్తంలో సాయం చేడయానికి ముందుకు రానుంది. క్రికెట్‌లో ఇలాంటి స్నేహపూరిత వాతావరణం ఉండడం చాలా మంచిది. ఇరుజట్ల మధ్య జరగనున్న టి20 సిరీస్..వరద నష్టాల నుంచి పాక్ ప్రజలకు, అక్కడి అభిమానులకు మంచి ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నా” అంటూ కెప్టెన్ బట్లర్ అన్నారు.

మరోపక్క ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్..స్వదేశంలో ఇంగ్లండ్ సిరీస్లో గెలిచి, టి20 ప్రపంచకప్‌కు ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి పాకిస్తాన్‌కు చేరుకున్న ఇంగ్లండ్ జట్టు.. ఏడు మ్యాచ్‌లు టి20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు ఇదొక మంచి ప్రాక్టీసుగా ఇరుజట్లకు ఉపయోగపడనుంది. ఇటువంటి సమయంలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బట్లర్ పెద్ద మనసు చాటుకున్నారు. పాకిస్తాన్‌లోని వరద బాధితులకు తమవంతు సహాయం చేస్తామని ప్రకటించాడు.