ఐపీఎల్ వేలం ప్రారంభమైంది. ఆటగాళ్లపై కోట్ల వర్షం కురుస్తుంది. మొదటిసారి ఐపీఎల్‌లోకి అడుగుపెడుతున్న హ్యారీ బ్రూక్ వేలంలో జాక్ పాట్ కొట్టాడు. అతనిని సన్ రైజర్స్ హైదరాబాద్ 13.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కనీస ధర రూ.2 కోట్లతో బరిలోకి దిగిన హ్యారీ బ్రూక్ కోసం రాజస్థాన్, బెంగళూరు, హైదరాబాద్ మధ్య తీవ్ర పోటీ నడిచింది. రాజస్థాన్ పర్సులో కేవలం రూ. 13 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే, బ్రూక్ కోసం మొత్తం 13 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. కానీ, సన్‌రైజర్స్ 13.25 కోట్లకు దక్కించుకుంది. ఇంగ్లాండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ ఈ మధ్యకాలంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు 99 మ్యాచులు ఆడి 140పైగా స్ట్రైక్ రేట్‌తో 2432 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను గుజరాత్ దక్కించుకుంది. బేస్ ప్రైస్ ధర రూ.2 కోట్లకే గుజరాత్ సొంతం చేసుకుంది.
మయాంక్ అగర్వాల్ @8.25 కోట్లు
పంజాబ్ మాజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ భారత్ ధరకు అమ్ముడయ్యాడు. అతనిని కూడా హైదరాబాద్ రూ.8.25 కోట్లకు సొంతం చేసుకుంది. మయాంక్ కోసం పంజాబ్, బెంగళూరు మధ్య పోటీ నడవగా చివరికి హైదరాబాద్ దక్కించుకుంది. అజింక్యా రహానెను చెన్నై రూ.50 లక్షలకు దక్కించుకుంది. వేలం తొలి భాగంలో జో రూట్, రిలీ రోసోవ్ అమ్ముడు కాలేదు..