వెనక్కి తగ్గిన జగన్..ఇంగ్లిష్ మీడియం 1 నుంచి 6 వరకే - MicTv.in - Telugu News
mictv telugu

వెనక్కి తగ్గిన జగన్..ఇంగ్లిష్ మీడియం 1 నుంచి 6 వరకే

November 9, 2019

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల ప్రతిపక్షాలు, మాతృ భాషాప్రియులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. మొదటి దశలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు మాత్రమే ఇంగ్లీష్ మీడియాన్ని వర్తింప జేయాలంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

andhra pradesh ..

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈరోజు జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు పూర్తిస్థాయిలో సన్నద్ధత లేనందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఆంగ్ల భాషకు చెందిన ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 14 నుంచి ప్రారంభమయ్యే ‘నాడు-నేడు’ కార్యక్రమంలో భాగంగా ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విధానాలను పాటించాల్సిందిగా సూచించారు.