ఇంగ్లిష్ మీడియంలో చదువులు అర్థం కావడం లేదంటూ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహకు పాల్పడింది. అంతవరకు మాతృభాషలో చదివిన తనకు ఇంగ్లిష్లో పాఠాలు కష్టంగా మారాయని సూసైడ్ నోట్లో పేర్కొంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ విషాదం చోటుచేసుకుంది. సంపది అనే విద్యార్థిని నగరంలోని నేషనల్ మెడికల్ కాలేజీలో నర్సింగ్ కోర్టు మొదటి సంవత్సరం చదువుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగాలీలో చదువుకున్న తనకు ఇంగ్లిష్ పాఠాలు అర్థం కావడం లేదని ఆమె ఆందోళన చెందింది. దీనికి తోడు తన చదువు కోసం తండ్రి చేసిన రూ. 5 లక్షలను తిరిగి ఎలా చెల్లించాలనో తెలీడం లేదని వాపోయింది. దసరా కోసం ఇంటికి వెళ్లినప్పుడు చదువు ఆపేస్తానని తండ్రితో చెప్పింది. అయితే అతడు నచ్చజెప్పి ఇంటికి పంపాడు. అయినా సంపతి ఆవేదనతో ఈరోజు(శనివారం) ఉదయం హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని చనిపోయింది. బంకూరా జిల్లాకు చెందిన సంపతి తండ్రి పెయింటర్ గా పనిచేస్తున్నాడు. ఇంగ్లిష్ మీడియం కారణంగా ఆగస్టులోనూ హుగ్లీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంగ్లిష్లో పాఠాలు అర్థం కావడం లేదంని సెయింట్ జేవియర్ కాలేజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి రైలు కింద పడి చనిపోయాడు.