ఒక్క లైన్ కూడా చదవలేకపోయిన ఇంగ్లిష్ టీచర్ (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్క లైన్ కూడా చదవలేకపోయిన ఇంగ్లిష్ టీచర్ (వీడియో)

November 30, 2019

కొన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్య ఎంత నాణ్యంగా ఉంటుందో కళ్లకు కట్టే ఉదంతం ఇది. ప్రతిభతో ఉద్యోగం సంపాదించుకుందో, లేకపోతే వేరే దారుల్లో కొలువు కొట్టేసిందో తెలియదు గాని ఇంగ్లిష్ టీచరమ్మ ఇంగ్లిష్ పాఠ్యపుస్తకంలోని  పేజీలో కనీసం ఒక్క లైను కూడా చక్కగా చదవలేక చేతులెత్తేసింది. వాజ్.. నో.. అంటూ ముక్కి మూల్గింది. తనిఖీకి వచ్చని మేజిస్ర్టేట్ ఆమెను ఉన్నపళంగా సస్పండ్ చేసి ఇంటికి సాగనపంపారు. 

ఉత్తరప్రదేశ్‌లోని సికందర్‌పూర్ సరౌసిలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం జరిగిందీ సంఘటన. జిల్లా మెజిస్ర్టేట్ దేవేంద్ర కుమార్ పాండే స్కూల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. ఓ తరగదితో ఇంగ్లిష్ బోధిస్తున్న ఉపాధ్యాయురాలి బోధన తేడాగా ఉండడంతో ఆమెకు ఇంగ్లిష్ పుస్తకం ఇచ్చి చదవమన్నాడు. ఆమె పిల్లలకంటే దారుణంగా చిదిగేసింది. చదువురాని టీచరమ్మ పిల్లలకు ఏం బోధిస్తుంటూ ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. హెడ్‌మాస్టర్, ఇతర టీచర్లు ‘సర్దిచెప్పి’నా ఆయన వినలేదు. ఇలాంటి టీచర్లతో పిల్లలు ఎందుకూ కొరగాకుండా పోతారని మండిపడ్డారు.