Enola Holmes 2 Hollywood movie review
mictv telugu

ఎనోలా హోమ్స్‌-2.. మూవీ రివ్యూ

November 8, 2022

షెర్లాక్‌ హోమ్స్‌ అనే డిటెక్టివ్‌ క్యారెక్టర్‌కున్న క్రేజ్, ఆ సిరీసుకున్న ఫ్యాన్‌ బేస్‌ గురించి ప్రపంచమంతా తెలిసిందే. షెర్లాక్‌ హోమ్స్‌ చెల్లిగా ఎనోలా హోమ్స్‌ అనే పాత్రని పరిచయం చేస్తూ రెండేళ్ల క్రితం ‘ఎనోలా హోమ్స్‌’ ఫస్ట్‌ పార్ఠ్‌ రిలీజైంది. తన తల్లి ట్రైనింగ్, అన్న షెర్లాక్‌ ప్రభావంతో టీనేజ్‌లోనే డిటెక్టివ్‌గా తన టాలెంట్‌ని ఎలా ప్రూవ్‌ చేసుకుందో చూయిస్తూ ఎనోలా క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్‌ చేస్తూ ప్రేక్షకుల ముందుకొచ్చిన మొదటి భాగానికి మంచి రెస్పాన్సే దక్కింది. దాంతో ఇప్పుడు అవే పాత్రలతో ఎనోలా హోమ్స్‌ -2 పేరుతో రెండో పార్ట్‌ని లేటెస్ట్‌గా నెట్‌ ఫ్లిక్స్‌లో రిలీజ్‌ చేశారు. మరి డిటెక్టివ్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాల్ని ఇష్టపడే ఆడియెన్స్‌ని ఈ చిత్రం ఆకట్టుకుందా? షెర్లాక్‌ ఫ్యాన్స్‌ని ఎనోలా ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.

కథ విషయానికొస్తే..

పార్ట్‌ వన్‌ తర్వాత ఎనోలా తన సొంత డిటెక్టివ్‌ ఏజెన్సీని ప్రారంభిస్తుంది. కానీ తను టీనేజ్‌ అమ్మాయి కావడంతో వచ్చిన క్లయింట్స్‌ అందరూ షెర్లాక్‌ గురించే అడుగుతారు. దాంతో విసుగెత్తి ఇక ఏజెన్సీని మూసేద్దామకునే టైమ్‌లో ఓ చిన్న పాప వచ్చి, మా అక్క కనిపించడం లేదని చెప్పడంతో ఆ కేసును క్రాక్‌ చేసే పనిలో పడుతుంది ఎనోలా. సరిగ్గా అదే సమయంలో షెర్లాక్‌ కూడా ఓ ఫైనాన్షియల్‌ కరప్షన్ కేసుని ఛేదించడంలో బిజీగా ఉంటాడు. కథ ముందుకు సాగే క్రమంలో అనుకోకుండా ఇద్దరి కేసుకి కొన్ని కనెక్టింగ్ అంశాలున్నాయని తేలుతుంది. దాంతో ఇద్దరూ కలిసి సమస్యని ఎలా పరిష్కరించారు? దోషుల్ని పట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ప్రత్యర్థులు వేసే ఎత్తుల్ని ఎలా ఎదుర్కొన్నారు? అనేదే అసలు కథ.

కథ వెనకున్న కథ

మామూలుగా డిటెక్టివ్‌ నేపథ్యంతో తెరకెక్కే సినిమాల్లో ఊహించని ట్విస్టులు, ఆశ్చర్యపరిచే సన్నివేశాలతోనే కథ నడుస్తూ ఉంటుంది. కానీ అప్పటి కాలంలో ఇంగ్లాండులో జరిగిన కొన్ని ఘటనల్ని ఆధారంగా చేసుకుని తీసిన సినిమా ఇది. దీంతో ఏదో కాల్పనిక కథని చూస్తున్నట్టు కాకుండా చరిత్రలోని ఆసక్తికర అంశాన్ని తెలుసుకుంటున్న ఫీల్‌ కలుగుతుంది. ఆ కాలంలో మహిళల హక్కులు, వాళ్ల పట్ల ఉన్న చిన్నచూపు, ఇలాంటి పాయింట్స్‌ని కూడా అంతర్లీనంగా బాగా చూయించారు.

మొత్తంగా పార్ట్‌ టూ ఎలా ఉందంటే..

ఫస్ట్‌ పార్ట్‌తో పోలిస్తే ఈ సెకండ్‌ పార్ట్‌లో మాత్రం ప్రాపర్‌గా ఓ కేసుని ఇన్వాల్వ్ చేసి, మొదటి నుంచి చివరి వరకూ దాన్ని క్రాక్‌ చేస్తున్నట్టుగా కథ నడుస్తుండడంతో ప్రేక్షకుడికి ఎక్కడా బోర్‌ కొట్టదే. ఇక షెర్లాక్‌ హోమ్స్‌ సిరీసుల్లో ఉండే ట్విస్టులు, సర్‌ ప్రైజింగ్ ఎలిమింట్స్, కేసును ఛేదించే ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లు అన్నీ ఈ మూవీలోనూ ఉండడంతో మంచి డిటెక్టివ్‌ సినిమా చూసిన ఫీల్‌ కచ్చితంగా కలుగుతుంది.

అలా అని ఎంతసేపు కేసు, ఎత్తుగడలు అనే కాకుండా ఎమోషన్స్‌, ఫ్యామిలీ, లవ్‌, కామెడీ, యాక్షన్‌ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ సినిమాలో ఉండడంతో చూస్తున్నంతసేపూ ఎక్కడా బోర్‌ కొట్టదు. ఫస్ట్‌ పార్ట్‌ చూసిన ఆడియెన్సుకి అందులోని పాత్రలు పరిచయం ఉండడంతో ఈ పార్టులోనూ వాళ్లు వచ్చినప్పుడల్లా ఈజీగా కనెక్టవుతారు. కొన్ని కామియో రోల్స్‌కి థ్రిల్‌ అవుతారు కూడా. స్టోరీ టెల్లింగ్‌లో భాగంగా అక్కడక్కడా వచ్చే యానిమేషన్స్‌, ఇలస్ట్రేషన్స్‌ నేరేషన్‌ని ఇంకాస్త ఎంగేజ్‌ చేస్తాయి.

కాస్ట్‌ అండ్‌ క్రూ పనితీరుకి ఫిదా

ఎనోలా హోమ్స్‌గా మిల్లీ బాబీ బ్రౌన్ అద్భుతంగా చేసింది. చెప్పాలంటే నటనపరంగా ఫస్ట్‌ పార్ట్‌లో కంటే సెకండ్‌ పార్ట్‌లో చాలా మెచ్యురిటీ కనిపించింది. టీనేజ్‌ డిటెక్టివ్‌గా తన పాత్రకున్న డిఫరెంట్‌ షేడ్స్‌ని బాగా పోట్రెయిట్ చేసింది. ఇక షెర్లాక్‌గా హెన్రీ కావిల్ పర్‌ఫామెన్స్‌ గురించి తెలిసిందే. సిన్సియర్‌ డిటెక్టివ్‌గా తన కేసుని డీల్‌ చేస్తూనే, మరోవైపు చెల్లికొచ్చిన అపాయాల్ని తప్పిస్తూ విలన్స్‌ ఆటకట్టించే పాత్రలో సూపర్బ్‌గా ఒదిగిపోయాడు. ఫస్ట్‌ పార్ట్‌లో తన క్యారెక్టర్‌కి పెద్దగా స్కోప్‌ లేదని ఫీలయ్యే షెర్లాక్‌ ఫ్యాన్స్‌ ఈ సెకండ్‌ పార్ట్‌తో పక్కా సాటిస్ ఫై అవుతారు. కథనం కూడా మొదటి భాగం కన్నా గ్రిప్పింగ్‌గా అనిపించడంతో డైరెక్టర్‌గా హ్యారీ బ్రాడ్‌బీర్‌ డబుల్‌ సక్సెసయ్యాడు.

ప్రొడక్షన్‌ వాల్యూస్‌, కెమెరా, ఆర్ట్‌ వర్క్‌, మ్యూజిక్‌తో పాటు టెక్నికల్‌గా కూడా అన్ని విభాగాలకు మంచి మార్కులే పడ్డాయి. సో.. ఓవరాల్‌గా చూస్తున్నంతసేపు ఎంగేజింగ్‌గా అనిపిస్తూ చూశాక ఓ మంచి ఫీల్‌నిచ్చే డిటెక్టివ్‌ బ్యాక్‌ డ్రాప్‌ చిత్రాలనిష్టపడే ఆడియెన్స్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ఈ సినిమాని చూసి ఎంజాయ్‌ చేయొచ్చు.