కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రను ఆపాలని కేంద్రం లేఖ రాసింది. చైనాతో సహా చాలా దేశాల్లో కరోనా మళ్ళీ పెరుగుతుండడంతో భారత్ కూడా ముందస్తు చర్యలను చేపడుతోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం రాహుల్ గాంధీకి కూడా ఒక లేఖను రాసింది. కరోనా వైరస్ వ్యప్తి ఆందోళన కలిగిస్తుండడం వలన జోడో యాత్రను కొన్నాళ్ళు ఆపాలని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్ సుఖ్ మాండవీయ రాహుల్ కు లెటర్ రాసారు. యాత్రలో కోవిడ్ నిబంధనలను పాటించడం అవదు కాబట్టి యాత్రను నిలిపివేయడమే మంచిదని విజ్ఞప్తి చేశారు.
భారత్ జోడో యాత్ర వలన కరోనా వ్యస్తి చెందే అవకాశం ఉందంటూ కేంద్ర ఆరోగ్య మంత్రికి రాజస్థాన్ కు చందిన ముగ్గురు ఎంపీలు లేఖలు రాశారు. ఇంతకు ముందు యాత్రలో పాల్గొన్న హియాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కు కరోనా బారిన పడిన విషయాన్ని ఇందులో ప్రస్తావించారు. జోడో యాత్రలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలే చేయాలని వారు కోరారు. వాక్సిన్ వేసుకున్న వారిని మాత్రమే యాత్రకు అనుమతించేలా ఏర్పాట్లు చేయాలని అడిగారు.
మరోవైపు కేంద్రమంత్రి లేఖపై కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. రాహుల్ జోడో యాత్రకు లభిస్తున్న ఆదరణనను చూసి బీజెపీ భయపడుతోందని అందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గుజరాత్ లో ఓట్లు అభ్యర్ధించడానికి వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు.