డొక్కు టీవీ తడాఖా.. 18 నెలలు ఊరంతా నెట్ కట్..  - MicTv.in - Telugu News
mictv telugu

డొక్కు టీవీ తడాఖా.. 18 నెలలు ఊరంతా నెట్ కట్.. 

September 30, 2020

entire village lost its broadband at the same time every day for 18 months. Now we know why

అదొక చిన్న గ్రామం. చాలా ఇళ్లకు ఇంటర్నెట్ సదుపాయం ఉంది. కానీ రోజూ పొద్దున గంట కొట్టినట్టుగా నెట్‌ పనిచేయకుండా పోతోంది. 18 నెలలుగా ఇదే సమస్య. ఎందుకిలా జరుగుతోందో అర్థం కాక జనం తలపట్టుకున్నారు. కాకలు తీరిన టెక్నీషియన్లు పిలిపించారు. వాళ్లు నానా తిప్పలూ పడ్డారు. వైర్లు మార్చారు, నానా ప్లగ్గులు, పిన్నులు, డివైజులు మార్చారు. అయినా సమస్య అర్థం కాక చేతులు పెకెత్తేశారు. ‘పోతే పోయింది. మళ్లీ వస్తోందిగా.. అది ఉన్నప్పుడే పని చేసుకోండి’ అని ఉచిత సలహా కూడా ఇచ్చారు. రోజులు దొర్లిపోయాయి. ఆ సమస్య ఎందుకొస్తుందో ఇటీవల బయటపడింది. జనం ‘వార్నీ’ అని నోళ్లు వెళ్లబెట్టారు. 

బ్రిటన్‌లోని వేల్స్ ప్రాంతంలో ఉన్న అబెర్హోసన్ గ్రామంలో జరిగిందీ సంఘటన. సెకెండ్ హ్యాండ్ డొక్కు టీవీ కారణంగా నెట్ కట్ అవుతోందని టెక్నీషయన్లు తెల్చేశారు. అందులోని వచ్చే సిగ్నళ్లు బ్రాండ్‌బ్యాండ్ సిగ్నళ్లను అడ్డుకుంటున్నట్లు ఓపెన్ రీచ్ అనే కంపెనీ ఇంజనీరు పసిగట్టాడు. సింగిల్ హైలెవెల్ ఇంపల్స్ నాయిస్(షైన్) అనే ఎలక్ట్రికల్ సిగ్నళ్ల వల్ల బ్రాడ్ బ్యాండ్‌కు అంతరాయం కలుగుతోందని గుర్తించాడు. ఆ ఇంటి యజమాని పొద్దన టీవీ ఆన్ చేయగానే నెట్ ఢమాల్ అనడం, టీవీ ఆఫ్ చేయగానే మళ్లీ రావడం జరుగుతోందని వివరించారు. సమస్య ఎక్కుడుందో తెలిసింది కనుక ఆ టీవీ ఇక శాశ్వతంగా మూగబోయింది! ఇంటర్నెట్ నిరాటంకంగా వచ్చేస్తోంది..