హెచ్‌ఐసీసీలో కలకలం.. బీజేపీ సమావేశాల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారి. - MicTv.in - Telugu News
mictv telugu

హెచ్‌ఐసీసీలో కలకలం.. బీజేపీ సమావేశాల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారి.

July 3, 2022

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతోన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కలకలం చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్‌ అధికారులు సమావేశం హాల్లోకి ప్రవేశించడంపై బీజేపీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సమావేశాల్లో ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు తీర్మానం ఫొటో తీస్తుండగా ఆ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి గుర్తించారు. వెంటనే ఆయనను పట్టుకొని పోలీసులకు అప్పజెప్పినట్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

బీజేపీ సమావేశాల లోపలికి ఇంటెలిజెన్స్‌ అధికారులు ప్రవేశించడంపై ఇంద్రసేనారెడ్డి తీవ్ర అభ్యంతరం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన నిఘా అధికారి శ్రీనివాసరావును పట్టుకున్నట్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తగిన చర్య కాదంటూ మండిపడ్డారు. అంతర్గత సమావేశంలోకి పోలీసులను పంపించి నిఘా పెట్టడం అనేది మంచి పద్ధతి కాదంటూ పేర్కొన్నారు. గతంలో వారు సమావేశం నిర్వహించుకున్నప్పుడు ఎవరు ఇలా చేయలేదన్నారు. పోలీసు ఇంటెలిజెన్స్ అధికారిని పట్టుకొని సీపీకి అప్పజెప్పినట్లు తెలిపారు. లోపల కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ బుక్ ఫోటో తీసే ప్రయత్నం చేశారని వివరించారు. ఆ ఫోటోలన్నింటిని డిలీట్ చేయించామని ఇంద్రాసేనారెడ్డి పేర్కొన్నారు