EO Dharma Reddy gives clarity on TTD fixed deposits
mictv telugu

రూ. 5 వేల కోట్లతో టీటీడీ ఏపీ బాండ్ల కొనుగోలు.. క్లారిటీ ఇచ్చిన ఈవో

November 5, 2022

ఏపీ ప్రభుత్వ బాండ్లను టీటీడీ కొంటోందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి మెచ్యూరిటీ పూర్తయిన రూ. 5 వేల కోట్లను వినియోగించనుందని ఆ వార్త సారాంశం. దీనిపై టీటీడీ శనివారం క్లారిటీ ఇచ్చింది. అవన్నీ తప్పుడు ప్రచారాలని, హిందూ ద్వేషులు పుకార్లు పుట్టించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవో ధర్మారెడ్డి స్పందిస్తూ.. టీటీడీ ఫిక్స్‌‌‌‌‌డ్ డిపాజిట్లన్నీ జాతీయ బ్యాంకుల్లోనే ఉన్నాయని, ఆ మొత్తం రూ. 15 వేల 900 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, భక్తులు ఎవరూ నమ్మవద్దని కోరారు. అలాగే డిపాజిట్లపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఇక అక్టోబర్ నెలలో మొత్తం 22.72 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, కానుకల ద్వారా రూ. 122.23 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. అలాగే 1.08 కోట్ల లడ్డూలు విక్రయించగా, 10.25 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వివరించారు.