ఈపీఎఫ్‌వో తన ఖాతాదారులకి ఈ-నామినేషన్‌ను తప్పనిసరి చేసింది. ఖాతాదారులు వెంటనే నామినీ వివరాలు వెంటనే నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో ఖాతాదారుడి కుటుంబానికి భద్రత లభిస్తుందని చెబుతున్నారు. ఈ -నామినేషన్ ద్వారా ఈపీఎఫ్‌వో తన సబ్ స్క్రైబర్లకు పూర్తి సమాచారం అందిస్తుంది. దీని ద్వారా నామినీ పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. దీంతో ఖాతాదారుడు సర్వీసులో మరణించినప్పుడు ఖాతాలోని డబ్బును విత్ డ్రా చేసుకోవడం సులభం అవుతుంది. సభ్యుడు తన నామినీని పేర్కొనకుండా చనిపోతే విత్ డ్రా ప్రక్రియలో ఇబ్బందులు వస్తాయి. దీనిని నివారించడానికి నామినేషన్ చేసుకోవాలి. ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీగా చేసే అవకాశం కూడా ఉంది. అదే విధంగా ఈపీఎఫ్‌వో సభ్యులు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI)కింద బీమా రక్షణ సౌకర్యాన్ని పొందుతారు. పథకంలో నామినీకి గరిష్టంగా రూ. 7 లక్షల బీమా కవరేజీ అందుతుంది.
క్రింద విధంగా ఈ నామినేషన్ అప్డేట్ చేసుకోవచ్చు
* మొదట epfindia.gov.in వెబ్ సైట్‌ను ఓపెన్ చేసుకోవాలి
* తర్వాత UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి
* మేనేజ్ ట్యాబ్ కింద ఇ-నామినేషన్‌ను ఎంచుకోవాలి
* తర్వాత అక్కడ అడిగిన వివరాలను అందించి సేవ్ బటన్ క్లిక్ చేయాలి
* కుటుంబ డిక్లరేషన్‌ను అప్డేట్ చేయడానికి yes బటన్ క్లిక్ చేసుకోవాలి
*తర్వాత కుటుంబ వివరాలను నమోదు చేసుకోవాలి
*షేర్ మొత్తం మొత్తాన్ని ప్రకటించడానికి నామినేషన్ వివరాలపై క్లిక్ చేయాలి.
*సేవ్ ఈపీఎఫ్ నామినేషన్‌పై క్లిక్ చేయండి.
* ఓటీపీని పొందేందుకు ఈ-సైన్‌పై క్లిక్ చేయండి.
*ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని ఎంటర్ చేసి ఈ నామినేషన్ అప్డేట్ చేసుకోవచ్చు