Epfo employment provident fund to amends rules limitations
mictv telugu

శుభవార్త.. ఇక అందరికీ ఈపీఎఫ్ఓ…!

August 30, 2022

Epfo employment provident fund to amends rules limitations

ఉద్యోగ భవిష్య నిధి ప్రాధికార సంస్థ (ఈపీఎఫ్ఓ) సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. జీతం పరిమితితో నిమిత్తం లేకుండా ఆసక్తి ఉన్న అందరికీ ఈపీఎఫ్ఓ సభ్యత్వం ఇవ్వనుంది. ఈమేరకు నిబంధనలను సవరించనుంది. ఒక సంస్థలో ఉద్యోగుల సంఖ్య, ఉద్యోగి జీతం పరిమితిని రద్దు చేసే ప్రతిపాదనలను పరిశీస్తున్నట్టు సమాచారం. ఈ ప్రతిపాదనలకు ఆమోదల లభిస్తే రూ. 15,000 కంటే తక్కువ జీతం ఉన్న వ్యక్తులు, 20 మంది ఉద్యోగులు లేని సంస్థ కూడా ఈపీఎఫ్ఓలో చేరడానికి వీలవుతుంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈపీఎఫ్‌ఓలో చేరాలంటే ఒక సంస్థలో 20మందికి పైగా ఉద్యోగులు ఉండాలి. వారి నెలజీతం రూ.15వేలు దాటి ఉండాలి. ఈ నిబంధనను మార్చడానికి ఈపీఎఫ్ఓ చట్టంలోని మిసిలేనియస్ ప్రొవిజన్స్ పరిమితులను రద్దు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని ఈ సంస్థ తన చందాదారులకు పింఛను, బీమా, రుణం తదితర సదుపాయాలు అందిస్తోంది. ఇందులో చేరితే ఉద్యోగి బేసిక్‌ శాలరీలో నుంచి 12 శాతం, సంస్థ నుంచి మరో 12శాతం ఉద్యోగి ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతుంది.