ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వాట్సాప్ లో ఈపీఎఫ్ఓ సేవలు - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వాట్సాప్ లో ఈపీఎఫ్ఓ సేవలు

October 14, 2020

EPFO to answer your queries on WhatsApp helpline

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఉద్యోగులకు మరో శుభవార్త తెలిపింది. లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులకు పిఎఫ్ డబ్బులు త్వరగా ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా వాట్సాప్ హెల్ప్ లైన్ సేవలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న 138 ఈపీఎఫ్‌ఓ ప్రాంతీయ కార్యాయాల పరిధిలో వాట్సాప్ హెల్ప్ లైన్ పనిచేస్తుంది. 

ఉద్యోగులు పీఎఫ్ సేవకు సంబంధించి ఏ విచారణ అయినా వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ పోర్టల్ లో ప్రాంతీయ కార్యాలయాల వారీగా వాట్సాప్ నంబర్లను సంస్థ పొందుపరిచింది. చందాదారుల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో ఈ సేవను తీసుకొచ్చినట్టు కార్మిక శాఖ తెలిపింది. ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఫిర్యాదుల పరిష్కారానికి ఈపీఎఫ్ ఐజీఎంఎస్ పోర్టల్, సీపీజీఆర్ఏఎంఎస్, ఫేస్ బుక్, ట్విటర్ ద్వారా సేవలు అందిస్తున్నాయి.