డోనాల్డ్ ట్రంప్ తాత అయ్యాడు..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంట్లో మరో ఫ్యామిలి మెంబర్ వచ్చింది. అతడి కుమారుడు ఎరిక్ కోడలు లారా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మరోసారి ట్రంప్ తాత అయ్యాడు. మొత్తం ఇప్పుడు అతని మనవలు, మనవరాళ్ల సంఖ్య 10కి చేరుకుంది. ఎరిక్ ట్రంప్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. తన కూతురు, భార్య, కొడుకుతో కలిసి దిగిన ఓ ఫొటోను కూడా షేర్ చేశాడు. కరోలినా డొరొతీ ట్రంప్‌ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నామంటూ పోస్టు చేశాడు.
డోనాల్డ్ ట్రంప్‌కు మొత్తం ముగ్గురు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు డోనాల్డ్ జూనియర్‌కు ఐదుగురు పిల్లలు ఉండగా, కూతురు ఇవాంక ట్రంప్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎరిక్ ట్రంప్‌కు ఇప్పటికే ఓ కుమారుడు ఉండగా తాజాగా కూతురు పుట్టింది. కాగా ట్రంప్ వ్యాపారాలన్నింటిని ఎరిక్ ట్రంప్ చూసుకుంటారు. ఇవాంక ట్రంప్ తన తండ్రికి సలహాదారుగా ఉన్నారు.