Erolla Musk had a second child with a foster daughter
mictv telugu

పెంపుడు కుమార్తెతో రెండో బిడ్డను కన్న ఎలాన్ మస్క్ తండ్రి

July 15, 2022

అపర కుబేరుడు ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ (76) సంచలన విషయం వెల్లడించారు. తన పెంపుడు కుమార్తె జానా (35) ద్వారా రహస్యంగా రెండో బిడ్డను కన్నానని చెప్పి నివ్వెరపరిచారు. ఇది తన కుటుంబానికి కాస్త గగురుపాటు కలిగించే విషయమే అయినా నిజం ఎప్పటికీ మారదన్నారు. దక్షిణాఫ్రికాలో ఇంజినీర్‌గా పనిచేసే ఎరోల్ మస్క్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం బహిరంగపరిచారు. ‘మొదటి బాబు ఇలియట్ రస్ 2017లో జన్మించాడు. ఇప్పుడతనికి ఐదేళ్లు. రెండో బిడ్డ 2019 పుట్టగా, వారిద్దరూ వారి తల్లి వద్దే ఉన్నారు. అయితే రెండో బిడ్డ విషయంలో మేం ఎలాంటి ప్లాన్ చేయలేదు. ఏజీవి అయినా భూమ్మీద ఉన్నది పునరుత్పత్తి కోసమే. ఈ విషయం తెలిసి మా కుటుంబం షాక్ అయింది. మా పిల్లలు ఇప్పటికీ ఈ విషయాన్ని ఇష్టపడరు. వారికిది గగురుపాటు కలిగించే అంశం. ఎందుకంటే జానా వారికి సోదరి కాబట్టి’ అని వివరించారు. కాగా, ఎలాన్ మస్క్‌తో కలిపి ఎరోల్ మస్క్‌కి ఏడుగురు సంతానం. ఎరోల్ మొదట ఎలాన్ మస్క్ తల్లి మాయేను పెళ్లాడారు. వారికి ముగ్గురు పిల్లలు పుట్టాక ఆమెను వదిలేసి హేడే అనే మహిళను వివాహం చేసుకున్నారు. హేడేకు అంతకు ముందే వేరే వ్యక్తితో కన్న జానా అనే కూతురు ఉంది. హేడేతో ఎరోల్ ఇద్దరు పిల్లలను కన్నాడు. ఇప్పుడు పెంపుడు కూతురు వరుస అయిన జానాతో ఇద్దరు పిల్లలు వెరసి మొత్తం ఏడుగురు పిల్లలు ఉన్నారు. అయితే ఈ విషయంలో ఎలాన్ మస్క్ కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నాడు. మరీ ఘోరంగా పెంపుడు కుమార్తెతో కాదు కానీ, ఇద్దరు ముగ్గురు భార్యల ద్వారా దాదాపు 5 మంది పిల్లలను కన్నాడు. అంతేకాక, భూమిపై త్వరలో జనాభా సంక్షోభం రానుందని, అందుకే అందరూ ఎక్కువ సంఖ్యలో పిల్లలను కనాలని హితబోధ చేస్తున్నాడు. ఎక్కువ సంతానం కనే తన కంపెనీ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇస్తానని కూడా ఎలాన్ మస్క్ ప్రకటించాడు.