గడ్డపార చేతబట్టి.. కూలీలతో కలసి మట్టి తవ్విన మంత్రి - Telugu News - Mic tv
mictv telugu

గడ్డపార చేతబట్టి.. కూలీలతో కలసి మట్టి తవ్విన మంత్రి

June 15, 2022

రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఉపాధి హామీ కూలీలతో కలసి పనిచేశారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు గుంటలు తీస్తున్న కూలీలతో కలసి.. తాను కూడా వారితో మమేకమయ్యారు. గడ్డపార చేతబట్టి గుంటలు తీశారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం కాట్రపల్లి లో పల్లె ప్రగతి లో పాల్గొనడానికి మంత్రి బయలు దేరారు. మార్గమధ్యంలో జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం చీటూరు గ్రామం వద్ద రోడ్ల కు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ కూలీలు గుంటలు తీసుకున్నారు. వెంటనే తన వాహనం అపిన మంత్రి ఆ కూలీలతో కలిసి గుంటలు తీశారు. గడ్డపార వేసి, మట్టిని తవ్వారు. అలాగే కొద్దిసేపు కూలీలతో మాట్లాడారు. కూలీ ఎంత పడుతున్నది? పనులు సాగుతున్నాయా? వంటి పలు ప్రశ్నలు వేశారు. అందుకు వాళ్ళు సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే మంత్రి వారికి కుశల ప్రశ్నలు వేసి, మాట్లాడి, సంతోష పెట్టారు.