మడత బెట్టే స్మార్ట్‌ఫోన్..కేవలం రూ.25000కే - MicTv.in - Telugu News
mictv telugu

మడత బెట్టే స్మార్ట్‌ఫోన్..కేవలం రూ.25000కే

December 4, 2019

Escobar 01

మొబైల్ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. మొబైల్ తయారీ సంస్థలు ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్లపై దృష్టి సారించాయి. ఇప్పటికే శాంసంగ్ కంపెనీ గాలక్సీ ఫోల్డ్ పేరుతో ఓ మడతబెట్టే ఫోన్‌ను విడుదల చేసిన సంగతి తెల్సిందే. మోటొరోలా కూడా మోటో రేజర్ 2019 పేరిట ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. గాలక్సీ ఫోల్డ్ ధర లక్షపైనే ఉంది. మోటో రేజర్ ధర కూడా ఎక్కువగా ఉండనుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఎస్కోబార్ అనే మొబైల్ తయారీ సంస్థ కీలక ప్రకటన చేసింది.

కేవలం 349 డాలర్లకే(సుమారు రూ.25,000) ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించనుంది. ఎస్కోబార్ ఫోల్డ్ 1 పేరుతో ఈ ఫోన్ మార్కెట్లో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 349 డాలర్లు(సుమారు రూ.25,000)గా నిర్ణయించగా, మరో వేరియంట్ 8 జీబీ ర్యామ్+512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 499 డాలర్లు(సుమారు రూ.35,800)గా ఉంది. కేవలం గోల్డ్ కలర్‌లో మాత్రమే ఈ ఫోన్ లభించనుంది. మొదటి సేల్‌లో వీరు లక్ష ఫోన్లను విక్రయించనున్నారు.

 

ఎస్కోబార్ ఫోల్డ్ 1 ప్రత్యేకతలు

 

* 7.8 అంగుళాల ఫుల్ హెచ్ డీ+అమోఎల్ఈడీ స్క్రీన్, 

* 16 + 20 మెగా పిక్సెల్ డ్యూయల్ రేర్ కెమెరా,

* క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్, 

* ఆక్టాకోర్ 2.8 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్, 

* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ,

* యూఎస్ బీ టైప్-సీ,

* డ్యూయల్ సిమ్, 

* ఫింగర్ ప్రింట్ సెన్సార్.