ఎస్సై మేడం.. మా సార్ రోజూ కొడుతుండు: పిల్లోడు ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్సై మేడం.. మా సార్ రోజూ కొడుతుండు: పిల్లోడు ఫిర్యాదు

March 5, 2022

12

మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో శనివారం విచిత్ర సంఘటన జరిగింది. 3వ తరగతి చదువుతున్న అనిల్ అనే పిల్లోడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి స్కూల్ టీచర్లపై ఫిర్యాదు చేసిన సంఘటన వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘ఎస్ఐ మేడం నన్ను సన్నీ సార్‌ రోజూ కొడతాండంటూ’ అంటూ మూడోవ తరగతి బుడతడు పోలీసులను ఆశ్రయించాడు. ఏ మాత్రం భయపడకుండా పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి, సార్‌ మీద ఫిర్యాదు చేశాడు.

అంతేకాకుండా సన్ని, వెంకట్ అనే టీచర్లపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. బాలుడి ఫిర్యాదుతో ఎస్సై రమాదేవి, తన సిబ్బందితో కలిసి స్కూల్‌కు వెళ్లి విచారణ చేపట్టారు. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన పంతుళ్లు.. సహనం కోల్పోవద్దని, ఓర్పుతో చదువు చెప్పాలని స్కూల్‌ టీచర్లకు పోలీసులు సూచించారు. అనంతరం పోలీసులు బుడతడి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అనిల్.. మాస్క్ పెట్టుకొని కరోనా రూల్స్ పాటించడం ప్రస్తుతం వీక్షకులను ఆకట్టుకుంటుంది.