కడప జిల్లాలో మరో డివిజన్ ఏర్పాటు - MicTv.in - Telugu News
mictv telugu

కడప జిల్లాలో మరో డివిజన్ ఏర్పాటు

December 21, 2021

11

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజును మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్‌లు కట్ చేసి, పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కడప జిల్లా ప్రజలకు సీఎం జగన్ ఓ బహుమతిని ఇచ్చారు. కడప జిల్లాకు చెందిన బద్యేలును రెవెన్యూ డివిజన్‌గా మారుస్తూ.. జీవో విడుదల చేశారు.

2021 జులై మాసంలో బద్వేల్‌లో పర్యటించిన ఆయన.. త్వరలోనే బద్వేల్‌ను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం తన పుట్టిన రోజును పురస్కరించుకొని జీవోను విడుదల చేశారు. దీంతో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ప్రజలు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.