భర్తలకు భరోసానట..బ్రతికున్న భార్యలకు పిండప్రదానం చేశారు... - MicTv.in - Telugu News
mictv telugu

భర్తలకు భరోసానట..బ్రతికున్న భార్యలకు పిండప్రదానం చేశారు…

October 8, 2018

చనిపోయినవారికి పిండప్రదానం చేస్తారు. కానీ బ్రతికున్న భార్యలకే పిండప్రదానం చేశారు కొందరు భర్తలు. ఈ ఘటనకు మహారాష్ట్రలోని నాసిక్ వేదికైంది. పెళ్లైన కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య విబేదాలు రావడంతో విడాకులు తీసుకుంటున్నారు. దీంతో మహిళలే ఎక్కువగా లాభం పొందుతున్నారు. భర్తలకు, భార్యలు విముక్తి కల్పిస్తారనే ఉద్దేశ్యంతో ‘వాస్తవ్ ఫౌండేషన్ ’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వందమంది భర్తలు తమ భార్యలకు వేదమంత్రోచ్ఛారణలతో, గోదావరి నదిలో తర్పణాలు విడిచారు.Estranged hubbies perform living wives’ funeral rites ఫౌండేషన్ అధ్యక్షుడు అమిత్ మాట్లాడుతూ..‘భర్తలకు  భరోసా కల్పించడానికే ఈ పిండప్రదానం కార్యక్రమం నిర్వహించాం. గతంలో వారణాసిలో భార్యలకు, భర్తలచేత పిండప్రదాన కార్యక్రమం నిర్వహించాం’ అని తెలిపారు.