Etala, Rajagopal Reddy received a call from the bjp high command
mictv telugu

ఆ ఇద్దరికీ బీజేపీ హైకమాండ్ పిలుపు

November 15, 2022

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. ఇద్దరు ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్టానం ఆహ్వానించింది. మంగళవారం సాయంత్రం వీరు అమిత్ షాతో భేటీ కానున్నారు. తెలంగాణలో పార్టీ మరింత బలోపేతం కావడానికి వీరికి అమిత్ షా మార్గనిర్దేశం చేయనున్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమిపై చర్చించే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి రావడం నుంచి..మునుగోడు ఉపఎన్నిక వరకు ఈటల అన్ని తానై నడిపించారు. ఇక మోదీ సభ తర్వాత ఈటల, రాజగోపాల్‌కు హైకమాండ్ నుంచి పిలుపు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇటీవల జరిగన మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తరపున బరిలో దిగిన రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయ సాధింగా..కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది.