గులాబీ జెండాకు ఓనర్లం, మంత్రి పదవి భిక్ష కాదు.. ఈటల - MicTv.in - Telugu News
mictv telugu

గులాబీ జెండాకు ఓనర్లం, మంత్రి పదవి భిక్ష కాదు.. ఈటల

August 29, 2019

Etala rajender......

కొత్త రెవిన్యూ చట్టం లీకైందన్న వ్యవహారంలో సీఎం కేసార్ తనపై ఆగ్రహంగా ఉన్నారని, కేబినెట్ నుంచి తప్పిస్తారని వస్తున్న వార్తలపై ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. తనకు మంత్రి పదవి ఎవరి భిక్షా కాదని స్పష్టం చేశారు. ‘అందరం కలసి తెలంగాణ తెచ్చుకున్నం. తెలంగాణ ఉద్యమంలో మూడున్నర కోట్ల మంది ఆత్మగౌరవ బావుటాను ఎగరేశాం. మేం గులాబీ జెండాకు ఓనర్లం. మంత్రి పదవి భిక్ష కాదు. మేం అడుక్కునేవాళ్లం కాదు. అధికారం శాశ్వతం కాదు. న్యాయం, ధర్మం మాత్రమే శాశ్వతం. వ్యక్తులు కాదు, ప్రజలే చరిత్ర నిర్మాతలు’ అని స్పష్టం చేశారు. 

ఆయన ఈ రోజు కరీంగనర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన టీఆర్ఎస్ కార్యకర్తలతో ముచ్చటించారు. తప్పు చేసిన వాళ్లు తప్పించేకోలేరని, వారికి ప్రజాక్షేత్రంలో శిక్ష పడి తీరుతుందని అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో 5 రూపాయల లంచం తీసుకున్నట్లు నిరూపించగలరా? అని ప్రశ్నించారు. కుసంస్కారులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అనామకంగా వచ్చిన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అదంతా ప్రజల అభిమానమని పేర్కొన్నారు.