కేసీఆర్ అవినీతి, నిరంకుశత్వంపై పోరాటం చేస్తానని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ రూ. 600 కోట్లు ఖర్చు పెట్టినా ప్రజలు చెంప చెళ్లుమనిపించారని వ్యాఖ్యానించారు. ఆయన ఈ రోజు గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరులకు నివాళి అర్పించి మీడియోతో మాట్లాడారు. తర్వాత అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.