హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈటల రాజేందర్‌తో ప్రమాణం చేయించారు. ‘సభానియమాలకు కట్టుబడి ఉంటానని, సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రమాణ చేస్తున్నాను’ అని ప్రతిన చేశారు.
తర్వాత ఆయన గన్ పార్క్ వెళ్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. ఈటల వెంట మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్, జితేందర్, వివేక్ సహా పలువురు నేతలు ఉన్నారు. ఈటల ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడం ఇది ఏడోసారి. అవనీతి ఆరోపణలతో రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఈటన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.