మొదలైన ఐపీఎల్.. టాస్ గెలిచిన కోల్‌కతా - MicTv.in - Telugu News
mictv telugu

మొదలైన ఐపీఎల్.. టాస్ గెలిచిన కోల్‌కతా

March 26, 2022

ipl

ఐపీఎల్-2022 కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ముంబై వేదికగా వాంఖెడే స్టేడియంలో తొలి మ్యాచ్‌ మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతోంది. ఇప్పటికే కోల్‌కతా సారథి శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో క్రికెట్ అభిమానులు కొందరు చెన్నై గెలుస్తుంది అంటే మరికొందరు కోల్‌కతా గెలుస్తుంది అంటూ అంచనాలు వేస్తున్నారు.

మరోవైపు ఇరుజట్లలోనూ మ్యాచ్ విన్నర్లు పుష్కలంగా ఉండడంతో, పోటీ హోరాహోరీగా సాగనుంది. చెన్నై జట్టుకు రవీంద్ర జడేజా నూతన సారథిగా అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ధోనీ వంటి అపార అనుభవజ్ఞుడు అండగా ఉండడం జడేజాకు కలిసొస్తుందని చెన్నై అభిమానులు ధీమాగా ఉన్నారు. ఇక, యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, డెవాన్ కాన్వే, రాబిన్ ఊతప్ప, శివమ్ దూబే, జడేజా, ధోనీలతో చెన్నై బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది.

అంతేవిధంగా కోల్‌కతా నైట్ రైడర్స్ విషయానికొస్తే.. వెంకటేశ్ అయ్యర్, రహానే, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, నితీశ్ రాణా, శామ్ బిల్లింగ్స్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ లతో భారీ బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, నరైన్, ఉమేశ్ యాదవ్, శివమ్ మావిలపై కోల్‌కతా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.