Etela Clariety On TRS Offer
mictv telugu

పార్టీ మార్పుపై ఈటల క్లారిటీ

November 17, 2022

పార్టీ మార్పుపై హుజూరాబాద్ ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్‌లోకి వెళ్తారన్న ప్రచారం ఒట్టిదేనని స్పష్టం చేశారు. అవసరమైతే రాజకీయాలు మానేస్తాగానీ పార్టీలు మారబోమని తేల్చిచెప్పారు. మరి బీజేపీ హైకమాండ్ ఈటలకు ఇచ్చిన హామీ ఏంటి?ఢిల్లీ వెళ్లి ఏం మాట్లాడారు?హైకమాండ్ ఇచ్చిన అభయం ఏంటి?

క్లారిటీ ఇచ్చేశారు

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మళ్లీ టీఆర్ఎస్‌లోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కేసీఆర్ బ్లూ ప్రింట్‌లో ఆయన పేరుందని, త్వరలోనే వెళ్తారని ఊహాగానాలు వచ్చాయి.అంతేకాదు ఈటలకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ ఇచ్చారని వార్తలొచ్చాయి. ఈటలతో పాటు టీఆర్ఎస్‌ను వీడిన అందిరినీ వెనక్కి రప్పిస్తారని టాక్ నడిచింది. ఈ ప్రచారంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ క్లారిటీ ఇచ్చేశారు. అవసరమైతే రాజకీయాలు మానేస్తా కానీ పార్టీలు మారబోమని స్పష్టం చేశారు.

అలా ఎలా వెళ్లాను?

“టీఆర్ఎస్‌లో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అన్ని భరించా.కేసీఆర్ చేసిన అవమానాలు బయటికి చెప్పుకోలేను.నాపై భూ కబ్జా ఆరోపణలు చేశారు. కబ్జాదారుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. ఇలాంటి పార్టీకి మళ్లీ నేనే ఎలా వెళ్తా.అసలు వెళ్లే ప్రసక్తే లేదు. అవసరమైతే రాజకీయాలు మానేస్తా.పార్టీలు మాత్రం మారబోను”అని ఈటల చెప్పారు.

ఢిల్లీకి ఇందుకేనా?
టీఆర్ఎస్ లోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతుండగానే ఈటల రాజేందర్‌కు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. అగ్రనేతల్ని కలిసి తాజాపరిణామాలపై చర్చించారు. మొన్నటి మునుగోడులో జరిగిన పరిణామాల్ని ఈటల ప్రస్తావించారు.పార్టీ వీడొద్దు..మీకు మేమున్నామంటూ హైకమాండ్ అభయం ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ ఇస్తారని ఊహాగానాలు వచ్చాయి. ఈ ఊహాగానాలపై మాత్రం ఈటల క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే పార్టీ జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ఉన్నారు. భవిష్యత్ ఈటలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.