Etela Rajender Like BJP CM Candidate...Workout To BJP In Telangana?
mictv telugu

బీజేపీ సీఎం అభ్యర్థిగా ఈటలను..ప్రకటిస్తే…

November 11, 2022

Etela Rajender Like BJP CM Candidate...Workout To BJP In Telangana?

బీజేపీ సీఎం అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ని ప్రకటిస్తే తెలంగాణ రాజకీయం మారుతుందా? 2023 ఎన్నికల్లో నువ్వు-నేనా అన్నట్లు ఉంటుందా? తెలంగాణలో ఈటలకు అంత వెయిటేజ్ ఉందా? సీఎం కేసీఆర్‌ను ఢీకొనే సత్తా ఉందా? ఈటెల బలం ఏంటి? కొందరు కార్యకర్తలు భావిస్తున్నట్లు ఆయనకు అంత సీనుందా? అసలు బీజేపీ మనస్సులో ఏముంది?

మిషన్ 2023

తెలంగాణ బీజేపీ మిషన్ 2023 పట్టాలెక్కించింది. ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ఢిల్లీ పెద్దల సూచనలతో పార్టీ శ్రేణుల్ని జోరుగా నడిపిస్తుంది. ఉప ఎన్నికల ఎత్తులు మిషన్ 2023లో భాగమే. దుబ్బాక, హుజూరాబాద్ ఉరిమే ఉత్సాహం ఇస్తే మునుగోడు.. కమలంలో కాన్ఫిడెన్స్‌ని పెంచింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ -బీజేపీ మధ్యే రేసు ఉంటుందని భావిస్తోంది. కొంతకాలంగా కొనసాగుతున్న ఆపరేషన్ ఆకర్ష్‌ని భవిష్యత్‌లో మరింత స్పీడ్ పెంచాలని యోచిస్తోంది. సీఎం కేసీఆర్‌ని ఢీ కొట్టాలంటే మామూలు విషయం కాదు. ఎత్తుకుపైఎత్తులు వేయాలి..కేసీఆర్ ఎత్తుల్ని పసిగట్టాలి. పక్కా లెక్కలు వేసుకోవాలి. బాణం గురి చూసి కొడితే ప్రత్యర్థికి గుచ్చుకోవాలి. లక్ష్యం నెరవేరాలంటే లాంగ్ లైఫ్ మిషన్ ఉండాలి. ఇప్పుడు తెలంగాణ బీజేపీ ఇదే ఆలోచిస్తోంది. ఆ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు కొందరు..ఈటెల పేరుని తెరపైకి తెస్తున్నారు. కేసీఆర్‌ని ఢీ కొట్టేందుకు సరైన మొనగాడు అని వారంటున్నారు.

ఈటెల పేరు ప్రకటిస్తే…

ఈటల రాజేందర్‌ను సీఎంగా అభ్యర్థిగా ప్రకటించాలని కొందరు అడుగుతున్నారు. అలా ప్రకటిస్తే తెలంగాణ రాజకీయం మారతుందని చెబుతున్నారు. కేసీఆర్ ఎత్తులు,గిత్తులు బాగా తెలిసిన నేత ఈటల. ఆయన్ను దగ్గర్నుంచి చూశారు. వ్యూహాల్ని పసిగట్టే తత్వం,,ప్రతి వ్యూహాలు పన్నే నైపుణ్యం ఈటల ఒక్కరికే ఉందని అంటున్నారు.అంతే కాదు ఈటల మంత్రిగా సమర్థంగా పనిచేసిన అవనుభవం ఉందని చూపిస్తున్నారు. మునుగోడులో అన్నీతానై నడిపించిన ఈటలతీరు వారిని ఆకట్టుకుంటుంది. 2023లో కూడా ఇలాగే చేస్తే తెలంగాణలో కమలం వికసిస్తుందని ఈటల అభిమానులు అంటున్నారు.

రియల్ ఇన్నింగ్స్

నిజానికి ఈటల రాజేందర్…బీజేపీలో జాయిన్ అయిన తొలినాళ్లలో అంత జోరుమీద లేరు. ప్రయారిటీ ఇవ్వడం లేదనే ఫీలింగ్ ఆయనకు ఉన్నదో లేదోగానీ కొందరు బీజేపీ కార్యకర్తలకు ఉండేది. వేదిక పై చివరన కూర్చున్న ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవేవి పట్టించుకోని ఈటల…ఆ తర్వాత కొన్ని రోజులకే డోస్ పెంచారు. కేసీఆర్ సర్కార్ పై తనదైన స్టయిల్‌లో విరుచుకుపడ్డారు. ఇది బీజేపీ ఢిల్లీ పెద్దలకు బాగా నచ్చినట్టుంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడే అవకాశం ఇచ్చారు. తర్వాత ఢిల్లీ పిలిపించి మాట్లాడారు. బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌గా నియమించారు. ఇంకేముంది ఈటల రియల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. బీజేపీకి ఏకే 47 గన్‌లా మారారు. అవసరమైనప్పుడల్లా బీజేపీ ఈ గన్ తో కేసీఆర్ పై విమర్శల తూటాలు కురిపిస్తుంది. గారు గిరు పోయి అరే ఓరే ..అనేదాకా ఓవర్ డోస్ పెంచారు అందుకే ఈటల్ని ముందే బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కొందరు కోరుతున్నారు.

ఎలక్లన్లకు ముందే బీజేపీ…సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుంది. ఇప్పటిదాకా అన్ని రాష్ట్రాల్లో ఇదే చేసింది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప అన్ని రాష్ట్రాల్లో ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించారు. తెలంగాణలో ఇలాగే ముందే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందా? ప్రకటిస్తే ఈటల పేరు ఎంచుకుంటుందా? లేదంటే కిషన్ రెడ్డిని తెరపైకి తెస్తుందా? సెగలు కక్కుతున్న బండికే ఆ అవకాశం ఇస్తుందా? అని పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది. బండి, కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌ల కన్నా ఈటల పేరు ప్రకటిస్తేనే బెటరని కొందరు అంటున్నారు. లాగుతున్న బండినే వదిలేస్తారా అనేవాళ్లూ ఉన్నారు. ఇంతకీ ఢిల్లీ పెద్దల మదిలో ఏముందో..?