తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఎమ్మెల్యేలుగా ఉన్నా నియోజకవర్గాల్ని సరిగా అభివృద్ధి చేయలేకపోయామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇల్లు అలకగానే పండుగ కాదని, మూడేళ్ళలో కొంత చేశాం.. ఇంకా చాలా చేస్తామని ఆయన చెప్పారు. ఈ సంవత్సరం డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేస్తామన్నారు. .
వ్యవసాయం బాగుంటేనే తెలంగాణ బాగుంటుందన్న ఈటెల..అందుకే ఉచిత విత్తనాలు, ఎరువులు ఇస్తున్నామని చెప్పారు. మానకొండూరు నియోజకవర్గం కేశవపట్నం మండలం కాచాపుర్ లో విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “గతంలో ఎండకాలం లో ఊర్లకు వస్తే కరెంట్ లేక చెట్లకింద కూర్చొనే వాళ్ళం. కానీ ఈ రోజు 24 గంటల కరెంటు ఇళ్లకు వచ్చింది. వచ్చే ఏడాదినుంచి బావులకు 24 గంటల కరెంట్ వస్తది” అని అన్నారు.
మరోవైపు 200 కోట్లతో ఎకరం కూడా ఎండిపోకుండా srsp కాలువలను మరమ్మతు చేయించామన్న ఈటెల…కాచాపుర్ నుంచి గద్దపాక రోడ్ కి హామీ ఇచ్చారు.