పవిత్రమైన అయ్యప్ప మాలలో.. ఈటీవీ ప్రభాకర్ కొడుకు పిచ్చి చేష్టలు - MicTv.in - Telugu News
mictv telugu

పవిత్రమైన అయ్యప్ప మాలలో.. ఈటీవీ ప్రభాకర్ కొడుకు పిచ్చి చేష్టలు

November 27, 2022

ఈటీవీ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ మరోసారి ట్రోలర్లకు చిక్కాడు. పవిత్రమైన అయ్యప్ప స్వామి మాలలో పిచ్చి చేష్టలు చేస్తూన్న ఫోటోలపై నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఈటీవీ ప్రభాకర్ గా పాపులర్ అయిన ప్రభాకర్ తన కొడుకు చంద్రహాస్ ను హీరోగా పరిచయం చేస్తూ ఇటీవల ఓ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రారంభోత్సవం రోజునే చంద్రహాస్‌పై ట్రోల్స్‌ దాడి జరిగింది. ఫొటోల్లో ఆయన యాటిట్యూడ్‌ని చూపిస్తున్నారని, నిత్యానంద స్వామిలా కనిపిస్తున్నారని రకరకాల వ్యాఖ్యలతో నెటిజన్లు రెచ్చిపోయారు. ఆ దెబ్బకు తండ్రి ప్రభాకర్ స్పందించి వివరణ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత మీడియాకు దూరంగా ఉంటున్న చంద్రహాస్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. అతని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. స్వామి మాలలో చంద్రహాస్ వేసిన పోజులు ఇప్పుడు నెటిజన్ల నుండి విమర్శలకు కారణమవుతున్నాయి. దీంతో చంద్రహాస్ మరోసారి చర్చనీయాంశంగా మారారు.

తాజాగా ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. చంద్రహాస్ కొత్త కారు కొనుక్కుని తన కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్రకు వెళుతున్న వార్తలను పంచుకుంటూ ఫోటోలను పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇవి వైరల్ అవుతున్నాయి. అయితే చంద్రహాస్ ఇచ్చిన పోజులు వివాదాస్పదంగా, విమర్శలకు గురవుతున్నాయి. తన కొత్త కారుపై ఆయన స్టైలిష్ పోజులు ఇవ్వడంపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులోనూ తన యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. స్వామి మాలలో ఉండి ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మాలలో ఉండి పిచ్చి చేష్టలు ఏంటంటూ విమర్శిస్తున్నారు. అయితే.. చంద్రహాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త కారుతో ఫోటోలు దిగాలని సరదా ఉండటం తప్పుకాదు. కానీ.. ఆ స్వామి మాలను తీసేవరకు వెయిట్ చేస్తే బాగుంటుందని పలు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం చంద్రహాస్ కారుతో దిగిన పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

 

ఇదికూడా చదవండి :సినిమాలకు స్వస్తి.. సాయిపల్లవి సంచలన నిర్ణయం ?