ఈవ్‌టీజర్‌ను గుడ్డలూడదీసి కొట్టిన మహిళలు - MicTv.in - Telugu News
mictv telugu

ఈవ్‌టీజర్‌ను గుడ్డలూడదీసి కొట్టిన మహిళలు

January 21, 2020

dfhtfjygbh

ఎన్ని కఠిన చట్టాలు తీసుకొని వచ్చినా.. మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. తాజాగా పంజాబ్ రాష్ట్రంలోని అంబాలా పట్టణంలో జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. అంబాలలో ముగ్గురు మైనర్ బాలికలను వేధించిన ఓ ఈవ్‌టీజర్‌ను మహిళలు పట్టుకొని అతని బట్టలు విప్పించి దేహశుద్ధి చేశారు. 

ముగ్గురు బాలికలు పాఠశాలకు వెళుతుండగా పవన్ అలియాస్ సోను అనే ఆకతాయి వెంటాడి వారిని లైంగికంగా వేధించాడు. పవన్ బాలికలపై అశ్లీల వ్యాఖ్యలు చేశాడు. బాలికలను వేధించిన ఘటన తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులైన మహిళలు వచ్చి ఈవ్‌టీజర్ పవన్ బట్టలు విప్పించి బహిరంగంగా రోడ్డుపై కొట్టారు. తరువాత అతన్ని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడు పవన్‌‌ను అరెస్టు చేసి అతడిపై ఐపీసీ సెక్షన్56, 12, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశారు.