‘సాహో’ నటి నిశ్చితార్థం.. బాయ్ ఫ్రెండ్‌తోనే - MicTv.in - Telugu News
mictv telugu

‘సాహో’ నటి నిశ్చితార్థం.. బాయ్ ఫ్రెండ్‌తోనే

October 8, 2019

టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి ఎవ్లిన్ శర్మ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది. ఎవ్లిన్ నిశ్చితార్థం నిన్న బాయ్‌ఫ్రెండ్ డాక్టర్ తుషాన్ భిందీతో జరిగిపోయింది. వీరిద్దరూ సోమవారం ఆస్ట్రేలియాలోని హార్బర్ బ్రిడ్జ్ వద్ద తతంగం ముగించారు. పడవలో తుషాన్.. ఎవ్లిన్ చేతికి ఉంగరం తొడిగిన తర్వాత ఇద్దర ముద్దుపెట్టుకున్నారు. అప్పుడు తీయించుకున్న ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

View this post on Instagram

Yessss!!! ?????

A post shared by Evelyn Sharma (@evelyn_sharma) on

 ‘నా కల నెరవేరింది. అతనికి నా గురించి బాగా తెలుసు. అతను నన్ను ప్రపోజ్ చేసిన పద్ధతి చాలా బావుంది. మేమిద్దం గత ఏడాది ఓ ఫ్రెండ్ ద్వారా పరిచయం చేసుకున్నాం. అతడు చాలా రొమాంటిక్. పెళ్లెప్పుడో ఇంకా నిర్ణయిచుకోలేదు… పెళ్లి తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లిపోవాలని అనుకుంటున్నాను. ఈ ప్రపంచంలో నాకు సిడ్నీ ఎంతో ఇష్టం’ అని చెప్పింది. ‘యే జవానీ హై దివానీ’, ‘యారియా’ తదితర బాలీవుడ్ చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించిన ఎవ్లిన్ సాహోలో ప్రాధాన్యమున్న పాత్ర పోషించింది.