Even if you don't cry... I will cry: KCR
mictv telugu

నువ్వు గోక్కోకపోయినా..నేను గోకుతా: కేసీఆర్

July 11, 2022

”ప్రధాని మోదీ..నువ్వు గోక్కున్నా గోక్కోకపోయినా, నేను మాత్రం గోకుతూనే ఉంటా. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా?. బీజేపీకి దమ్ముంటే తేదీని ఖరారు చేసి ముందుకొస్తే నేను శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధం” అంటూ కేసీఆర్ మోదీపై, బీజేపీ నాయకులపై తీవ్రంగా మండిపడ్డారు.

ప్రగతిభవన్‌లో ఆదివారం భారీ వర్షాలు, వరదలపై మంత్రులతో, అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ”దేశంలో గుణాత్మక మార్పు రావాలి. తెలంగాణ మాదిరిగా గొప్ప గొప్ప ప్రాజెక్టులు కట్టుకోవాలి. విప్లవ బాటలో పయనించాలి. దేశంలో కొత్త పార్టీ రావొద్దా? అవసరమైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుంది. ప్రపంచంలో ఏ దేశానికీ లేని అనుకూలతలు మన దేశానికి ఉన్నాయి. కానీ, కేంద్రం అసమర్థ విధానాల కారణంగా మనం పిచ్చి మొఖాలు వేసుకుని మెక్ డొనాల్డ్ పిజ్జాలు, బర్గర్లు తింటున్నాం. దేశ చరిత్రలోనే అత్యంత అసమర్ధ ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన హయాంలో అవివేకపాలన నడుస్తోంది” అని కేసీఆర్ అన్నారు.

మరోపక్క కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు రాజకీయ విశ్లేషకులు తెలంగాణలో ఎటువంటి సందర్భం వచ్చిన ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని గతంలో మాట ఇచ్చిన కేసీఆర్.. నిన్న అసెంబ్లీని రద్దు చేస్తానని అనడంతో తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికలు రానున్నాయని అంచనా వేస్తున్నారు. పరోక్షంగా ఆయన విపక్షాలకు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఓ హింట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మరి విశ్లేషకుల అంచనా నిజం అవుతుందా? లేదా? అనే విషయం తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.