రాక్షస సాలీడు.. పక్షిని పట్టుకుని(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

రాక్షస సాలీడు.. పక్షిని పట్టుకుని(వీడియో)

September 20, 2020

 

cngcn

సాలీడు ఉచ్చులో చిక్కుకున్న ఈగ, దోమ, తూనీగా, పురుగుల పని మటాషే. అవి దాని వలలాంటి గూడులో చిక్కుకున్నాయంటే సాలీడుకి పండగే. వెళ్లి లటుక్కున అందుకుని వాటిని ఆరగిస్తుంది. ఇలా కూర్చున్న చోటే ఆహారాన్ని సంపాదించుకునేవాటిలో మనం మొసలి తర్వాత సాలీడునే చూస్తున్నాం. అయితే సాలీడు చిన్న చిన్న పురుగు పుట్రను తినేయగా చూశాం కానీ, ఓ సాలీడు ఏకంగా పక్షిని పట్టుకుని నంజుకుతింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. 

నేచర్ ఈజ్ స్కేరీ అనే ట్విటర్ ఖాతా నుంచి ఈ వీడియో షేర్ అయింది. అద్భుతమైన భయం అని దీనికి క్యాప్షన్ ఇచ్చారు. 54 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో పెద్ద సైజు అవికులేరియా అనే రాక్షస సాలీడు ఊరపిచ్చుక పరిమాణంలో ఉన్న ఓ పక్షిని పట్టుకుని తింటోంది. మెల్లగా ఆ సాలీడు పక్షిని తన నోట్లోకి తీసుకోవడం వీడియోలో చూడొచ్చు. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి సాలీడును చూడలేదు అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇళ్లలో ఉంటే పిల్లలకు ప్రమాదం అంటున్నారు.