టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భ్లీమా నాయక్’. ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, విలన్‌గా రానా దగ్గబాటి కలిసి నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. అందులో పవన్ కల్యాణ్ చెప్పే డైలాగులు అభిమానులను ఎంతంగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
తాజాగా ‘భ్లీమా నాయక్’ ట్రైలర్‌పై హీరో రామ్ చరణ్ ట్విటర్ వేదికగా స్పందించారు. “భీమ్లా నాయక్ ట్రైలర్‌ను చూస్తుంటే ఎలక్ట్రిఫైయింగ్గా ఉంది. పవన్ కల్యాణ్ గారి ప్రతీ డైలాగ్, యాక్షన్ పవర్‌ఫుల్‌గా ఉంది. నా మిత్రుడు రానా నటన, కనిపించిన తీరు సూపర్బ్‌గా ఉంది. త్రివిక్రమ్, సాగర్ కె చంద్ర, నిత్య మీనన్, సితార ఎంటర్టైన్మెంట్స్, తమన్‌కు ఆల్ ది బెస్ట్’ అంటూ రామ్ చరణ్ తెలిపారు.
మరోపక్క గతకొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకను.. ఈరోజు సాయంత్రం 6.30 గంటల నుంచి హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ్ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.