Every town and village in Telangana is wonderful: KTR
mictv telugu

2 వేలకు పెంచినం..అత్త, కోడలు మంచిగా ఉంటున్నారు: కేటీఆర్

June 22, 2022

ktr

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి పట్టణం, పల్లె చాలా అద్భుతంగా ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నేడు హైదరాబాద్‌లోని జహీరాబాద్‌లో ఆయన పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..” జహీరాబాద్ మున్సిపాలిటీ అయిన తర్వాత ఒకేసారి 50 కోట్ల రూపాయలను కేసీఆర్ మంజూరు చేశారు. ఈ మున్సిపాలిటికీ చాలా సౌకర్యాలు కల్పించాం. మహిళల కోసం, కూరగాయల మార్కెట్ కోసం 14.50 కోట్లతో మార్కెట్ కడుతున్నాం. ఆగస్టు 15లోపు అందుబాటులోకి తెస్తాం. జహీరాబాద్‌లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రగతి కోసం 18.79 కోట్లు విడుదల చేశాం. మరో 50 కోట్లు మౌలిక వసతుల కోసం ఇచ్చాం. ఇప్పుడు రాష్ట్రంలోని ఏ పట్టణం చూసిన, ఏ పల్లె చూసినా చాలా అద్భుతంగా ఉంది” అని ఆయన అన్నారు.

మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణనే అని, రోజు మంచి నీళ్లు వస్తున్నాయా అని విధి విధి తిరుగుతూ, ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘తెలంగాణ రాకముందు పెన్షన్లు అప్పట్లో 200 ఉండేవి, ఇప్పుడు 2000 చేసినం. అత్త, కొడళ్లు మంచిగా కలిసి ఉంటున్నారు. 40 లక్షల ముందికి పెన్షన్ ఇస్తున్నం. మరో నెలల్లో అర్హులైన అందరికి పెన్షన్ ఇస్తాం. ఈ ప్రాంతంలో సంగమేశ్వర దేవుడు చాలా పవర్ ఫుల్.. సింగూరు నీళ్లు తెచ్చి మీ బీడు భూములన్నీ తడుపుతాం.. లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం అని ఆయన మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి 12 లక్షల మందికి ఇస్తోంది’ అని కేటీఆర్ పేర్కొన్నారు.