కంటెంట్ ఉంటే ఎంత పెద్ద అవార్డులు అయినా సాష్టాంగప్రమాణం చేయాల్సిందే. ఆ సినిమాలకు ఏ హంగులూ, ఆర్భాటాలూ ఉండవు. పెద్దగా ప్రచారం కూడా ఉండదు కానీ జనాల్లోకి బాగా వెళతాయి. అందరి ప్రశంసలనూ దక్కించుకుంటాయి. అస్కార్ అవార్డులు కూడా పరుగెట్టుకుంటూ వస్తాయి. అందుకు నిదర్శనమే ఈ ఏడాది అవార్డ్ దక్కించుకున్న రెండు సినిమాలు. అందులో ఒకటి భారతీయ సినిమానే.
Every Thing Every Where All At Ones :
ఈ ఏడాది అవార్డుల పంట పండిన సినిమా every thing every where all at ones. ఈ సినిమాకు ఏకంగా ఏడు అవార్డులు వచ్చాయి. హాలీవుడ్ సినిమాలు అంటే సాధారణంగా భారీ ఎత్తున ఖర్చు, కళ్ళు చెదిరే గ్రాఫిక్స్, ఒకే సినిమాలో ఇద్దరు ముగ్గురు టాప్ హీరోలు, అందమయిన అమ్మాయిలు ఉంటారు. అలాంటివాటికే అవార్డులు కూడా వస్తాయని చరిత్ర చెబుతోంది. కానీ ఈసారి అలా ఎలాంటి హంగులూ, ఆర్భాటాలూ లేని ఒక మామూలు సినిమాకు పట్టం దక్కింది.
ఓ మధ్య వయస్కురాలి కథ:
ఒక మధ్య వయస్కురాలైన చైనా మహిళ కథ every thing every where all at ones. ఈమె చైనా నుంచి వలస రావడంతో సినిమా మొదలవుతుంది. అక్కడ ఆమె ఎదుర్కొన్న సమస్యలు, ఫేస్ చేసిన పరిస్థితులు ఈ సినిమా వృత్తాంతం. నైతిక విలువలు, మానవతా విలువలు,అసంబద్దత,ABSARDISIM,NIHILISM,DEPRESSION,IDENTITY లను సినిమాలో చూపించారు. అమెరికాలో ఆసియా వాసుల ఎదుర్కొంటున్న సమస్యను సినిమాలో గ్లోరిఫై చేశారు. ఒక రకమయిన డిప్రెషన్, భవిష్యత్ పట్ల నమ్మకం లేని స్థితి ఇవన్నీ దర్శకుడు హృద్యంగా చిత్రీకరించారు. ఆసియా వాసుల కష్టాలను వెండి తెరపై మలిచారు. భారతదేశంలో సత్యజిత్ రే,మృణల్ సేన్,శ్యామ్ బెనిగాల్ మొదలయిన వారు ఇలాంటివాటిలో నిష్ణాతులు.
ఒకే సినిమాకు ఏడు అవార్డులు:
వాస్తవానికి దగ్గరగా ఉంది కాబట్టే every thing every where all at ones సినిమాకు అవార్డుల పంట పండింది అంటున్నారు క్రిటిక్స్. 9 అంశాల్లో నామినేట్ చేయగా 7 అంశాలలో అవార్డులు వచ్చాయి.
ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి,ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ ఒరిజినల్ సౌండ్ అవార్డులను సొంతం చేసుకుందీ చిత్రం.
అవార్డు దక్కించుకున్న భారతీయ చిన్న సినిమా:
అలాగే మరో సహజ సిద్ధమైన, ఎమోషనల్ సినిమాను కూడా ఆస్కార్ అవార్డ్ వరించింది. అది భారతీయ సినిమా కావడం మరో విశేషం. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా నుంచి వెళ్ళిన ఆస్కార్ సాధించిన ఏకైక షార్ట్ ఫిల్మ్ ది ఎలిఫెంట్ విస్సరర్స్. కేవలం స్టోరీ మాత్రమే ఉండి ఎటువంటి గ్రాఫిక్స్ లేని సినిమా ఇది. గిరిజన గూడెంలోని ఏనుగు పిల్లలను పెంచే దంపతులు కథే ఈ సినిమా. ప్రకృతి ఒడిలో.. జంతువుల మధ్య జీవినం సాగించే ఓ వృద్ధ దంపతుల కథ ఇది. ఏనుగులనే పిల్లలుగా అనుకుని వాటికి పేర్లు పెట్టి పెంచిపెద్ద చేస్తారు.. పెద్ద అయిన ఏనుగులను అటవీ అధికారులు తీసుకెళతారు, ఆ సమయంలో వాళ్ళు పడే మనోవేదన, పిల్లలు దూరం అవుతున్నారనే బాధను హృద్యంగా తెరకెక్కించారు ది ఎలిఫెంట్ విస్పరర్స్ డైరక్టర్ కార్తీ.
కథ ఏంటంటే:
తమిళనాడు రాష్ట్రం ముదుమలైన టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని ఓ గిరిజన గూడెం జరిగే కథ ది ఎలిఫెంట్ విస్పరర్స్. అడవిలో అనాథగా మిగిలిపోయిన ఏనుగు పిల్లలను అటవీ అధికారులు ఓ దంపతులకు ఇచ్చి పెంచమంటారు. దానికోసం కొంత డబ్బు ఇస్తారు. ఆ గిరిజన గూడెంలో ఎలిఫెంట్ ఫీడింగ్ సెంటర్ కూడా నిర్వహిస్తుంటారు. అలా అటవీ అధికారులు ఇచ్చే ఏనుగు పిల్లలను సొంత పిల్లలుగా పెంచుతారు బొమన్, బెస్లీ అనే దంపతులు. రఘు, అమ్ము అనే ఏనుగు పిల్లలకు వాళ్ళిద్దరూ ఉదయం నిద్ర లేపి స్నానం చేయిస్తారు, ఆహారం ఇస్తారు, పాలు పడతారు, ఆటలు ఆడిస్తారు, ఎక్సర్ సైజు చేయిస్తారు, పండుగలకు ముచ్చటగా అలంకరిస్తారు, పూజలు చేస్తారు, సొంత బిడ్డలను సాకినట్లు సాకుతారు.
ఈ డాక్యుమెంటరీ తీయటానికి ది ఎలిఫెంట్ విస్పరర్స్ టీంకు ఐదేళ్ళు పట్టింది. చిన్న ఏనుగు పిల్ల నుంచి ఐదేళ్ళ వరకు ఎలా పెరిగింది అనేది దగ్గరుండి షూట్ చేశారు డైరెక్టర్ కార్తికీ గొన్సాల్వేస్. డాక్యుమెంటరీ చూస్తున్నంతసేపు మనస్సుకు హత్తుకుంటుంది. మనుషులు – జంతువుల మధ్య ప్రేమ ఎలా ఉంటుంది.. గిరిజన గూడెంలో.. అటవీ ప్రాంతాల్లోని వ్యక్తులు జంతువులను ఏ విధంగా ప్రేమిస్తారు అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు కార్తీ. అందుకే ఈ సినిమాకు అవార్డ్ వచ్చింది. కార్తీ ఐదేళ్ళ కష్టానికి ఫలితం దక్కింది.