అన్నీ మార్చిపోయిన..ఇక విమర్శలు ఉండవు: జగ్గారెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

అన్నీ మార్చిపోయిన..ఇక విమర్శలు ఉండవు: జగ్గారెడ్డి

April 6, 2022

fbfbfd

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి బుధవారం ఢిల్లీలో తన కుటుంబ సభ్యులతో కలిసి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. భేటీలో భాగంగా రాహుల్ గాంధీ సందేశం విన్న తర్వాత.. గతంలో తాను చెప్పిన విషయాలన్నీ మర్చిపోయానని జగ్గారెడ్డి అన్నారు. ”ఇకపై బహిరంగ విమర్శలు ఉండవు. మీరు కూడా చూడరు. పార్టీలో ఇప్పుడు సమస్యలే లేవు. నా కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్ గాంధీని కలవాలని ఎప్పటినుంచో అనుకున్నాను. అది ఈరోజు కుదిరింది” అని ఆయన అన్నారు.

అంతేకాకుండా రాజకీయాల కంటే ముందు తమ పిల్లల చదువుల గురించి రాహుల్ గాంధీ అడిగారని అన్నారు. తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలను ఏ విధంగా నిలదీయాలి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలా పోరాడాలనే దానిపై రాహుల్‌ చర్చించారని ఆయన తెలిపారు.

రాహుల్‌తో మాట్లాడిన తర్వాత.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలన్నీ మర్చిపోయానని, గతంలో చెప్పిన విషయాలేవీ గుర్తులేవని.. కాంగ్రెస్‌ను గెలిపించేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఇకనుంచి మా మధ్య ఎలాంటి విభేదాలు ఉండవు. కలిసికట్టుగా ఎలా పనిచేస్తామో లేదో మీరే చూస్తారు కదా జగ్గారెడ్డి స్పష్టం చేశారు.