Everything is ready for demolition..Tomorrow at 2.30 1,2,3
mictv telugu

కూల్చివేతకు సర్వం సిద్ధం..రేపు 2.30కి 1,2,3

August 27, 2022

దేశ రాజధాని ఢిల్లీ నగరానికి దాదాపు 50 కి.మీ.ల దూరంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ పరిధిలోని నోయిడాలో నిర్మించిన 40 అంతస్తుల జంట భవనాల కూల్చివేతకు సర్వం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం 2.30కి కూల్చివేత మొదలౌతుందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలియజేశారు. అయితే, ఆదివారం 1వ అంతస్తు నుంచి 3వ అంతస్తు వరకు కూల్చివేతకు రంగం సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ జంట భవనాల కూల్చివేతలో భద్రతా సిబ్బంది ఖచ్చితంగా నిబంధనలను పాటించాలని యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ విషయమై శుక్రవారం అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..”భవనం చుట్టుపక్కల ఉన్న ఇండ్లను సత్వరమే ఖాళీ చేయించండి. నోయిడా, గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేలను అరగంట సేపు బంద్ చేయండి. 40 అంతస్తుల ఈ జంట భవనాల్లో ప్లాట్లు కొన్నవారికి ఎస్టేట్ సంస్థ మొత్తం వారికి తిరిగి చెల్లిస్తుందని సుప్రీంకోర్టు హామీ ఇచ్చింది” అని ఆయన అన్నారు.

అయితే, ఈ జంట భవనాల కూల్చివేతకు గతేడాది ఆగస్టు 31నే సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో అధికారులు..చుట్టుపక్కల భవనాల్లోని 5 వేల మందిని పెంపుడు జంతువులతో సహా ఆదివారం ఉదయం ఏడింటికల్లా ఖాళీ చేయించనున్నారు. వారికి సంబంధించిన 2,700 వాహనాలను మరోచోటుకు తరలించి, చుట్టూ 500 మీటర్ల మేర జనసంచారం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. చుట్టుపక్కల వారి కోసం 3 ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్యబృందం, మందులు, ఆ అంబులెన్సులు సిద్ధం చేశారు. ధూళి పైకెగరకుండా ఆ ప్రాంతమంతా ఇనుప జాలీలు, కవర్లతో కప్పడానికి సిద్ధం చేశారు.

”నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ ఢిల్లీ పరిధిలోని నోయిడా సెక్టార్‌ 93ఏలో రియల్టీ సంస్థ సూపర్‌ టెక్‌ ఎమరాల్డ్‌ పేరుతో 40 అంతస్థుల జంట భవనాల నిర్మాణ పనులు ప్రారంభించింది. 32వ అంతస్థు వరకు నిర్మాణ పనులు జరిగాక, నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ కోర్టులో కేసు నమోదు అయ్యింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు జంట భవనాలు కూల్చేయాలని తీర్పు ఇచ్చింది. కొనుగోలుదారుల తక్షణ అవసరాలకుగాను రూ.కోటి తమ రిజిస్ట్రీలో జమ చేయాలని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ జేబీ పర్షి వాలాల ధర్మాసనం నిర్మాణ సంస్థను ఆదేశించింది. సెప్టెంబరు 30 దీనికి గడువుగా విధించింది. 50 ప్లాట్ల కొనుగోలుదారులకు మాత్రమే రీఫండ్ చేయాల్సి ఉందని, మిగతావారికి ప్రత్యామ్నాయం చూపినట్లు నిర్మాణ సంస్థ కోర్టుకు తెలిపింది.”