డెంగీ లేకున్నా బొప్పాయి తినేయండి..  - MicTv.in - Telugu News
mictv telugu

డెంగీ లేకున్నా బొప్పాయి తినేయండి.. 

October 1, 2019

Evidence-Based Health Benefits of Papaya

బొప్పాయి పండు తినడానికి రుచికరంగా ఉండటం మాత్రమే కాదు.. కొన్ని రకాల రోగాలను నయం చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. బొప్పాయిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తంలో ప్లేట్ లెట్స్ తగ్గినవారు బొప్పాయి ఆకుల రసాన్ని జ్యూస్ చేసుకొని సేవిస్తే మంచి వలితాలు ఉంటాయని పరిశోధనలో తేలింది. ప్రస్తుతం డెంగీ జ్వరాలు ప్రబలుతున్న తరుణంలో బొప్పాయి ఆకుల జ్యూస్ గురించి ఎక్కువగా ప్రచారం జరిగింది. అయితే కేవలం బొప్పాయి ఆకు జ్యూస్ మాత్రమే డెంగీని నివారించదని.. ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. బొప్పాయి తింటే కలిగే వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. 

 

* భోజనం చేసాక బొప్పాయి పండు తింటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. 

* బొప్పాయి తినడం వల్ల మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను అరికట్టవచ్చు. 

* బొప్పాయిని రోజూ తినడం వల్ల శరీర బరువు తగ్గుతుంది.

* బొప్పాయి కొవ్వు పదార్థాల వల్ల ఏర్పడే సమస్యల నివారిస్తుంది.

*  గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. 

*  అలసట, అనారోగ్య సమస్యలను తొలగిస్తుంది. 

* క్యాన్సర్‌ నివారణలో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇందులో బిటాకెరోటిన్‌, లూటిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి. 

* పొట్ట, పేగులలో చేరే విషపదార్థాలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. 

* బొప్పాయి తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉండటంతో పాటు కంటి సమస్యలను తీరుస్తుంది. 

* బి.పి, షుగర్‌ ఉన్నవారు బొప్పాయి తింటే చాలా ఉపయోగం ఉంటుంది. 

* నారింజ, యాపిల్‌ కంటే బొప్పాయిలో విటమిన్‌ ఇ ఎక్కువగా ఉంటుంది. 

* చర్మం పొర చాలా సున్నితంగా, మృదువుగా మారడానికి బొప్పాయి జ్యూస్‌ సహాయపడుతుంది. 

* ఇది కొలెన్‌, గర్భాశయ క్యాన్సర్‌లను తగ్గిస్తుంది.