సల్మాన్, శత్రుఘ్న నన్ను రేప్ చేశారు.. నటి పూజ - MicTv.in - Telugu News
mictv telugu

సల్మాన్, శత్రుఘ్న నన్ను రేప్ చేశారు.. నటి పూజ

October 13, 2018

మీటూ ఉద్యమం.. బాలీవుడ్ సెలబ్రిటీల గుండెల్లో వణుకుపుట్టిస్తోంది. తమపైనా ఆరోపణలు చేస్తారేమోనని నటులు బితుకుబితుకుమంటున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బండారాన్ని బయటపెడతానని హెయిర్ డిజైనర్ సప్నా భవ్నానీ చెప్పడంతో మీటూ మరింత వేడిగా మారింది. తాజాగా కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా రేపిస్టేనని నటి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ పూజామిశ్రా బాంబు పేల్చింది. సల్మాన్, అతని సోదరులు, యాంగ్రీహీరో శత్రుఘ్న సిన్హా తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, తన తండ్రిని కూడా చంపేశారని తెలిపింది.trt

వారి నుంచి తనకు ప్రాణహాని కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘సుల్తాన్ మూవీ షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో సల్మాన్ నాపై అత్యాచారం చేశాడు. అతని సోదరులు సొహైల్ ఖాన్, అర్బాజ్ ఖాన్‌లు  కూడా లైంగిక దాడికి తెగబడ్డారు.. ఇప్పుడు వారికి తిప్పలు తప్పవు. వారంతా శిక్ష అనుభ‌వించక తప్పదు.. శత్రుఘ్న సిన్హా కూడా నాపై అత్యాచారం చేశాడు. అతని కుటుంబం అందుకు సహకరించింది.’ అని చెప్పింది పూజ. ఈమేరకు ఒక వీడియోను ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఈ ఆరోపణలపై సల్మాన్, అతని తమ్ముళ్లు ఇంతవరకూ స్పదించలేదు. అమితాబ్ నుంచి కూడా స్పందన రాలేదు. సల్మాన్‌పై పూజ గతంలోనూ ఆరోపణలు చేసింది.

Ex-Bigg Boss contestant Pooja Misra accuses Salman Khan, Shatrughan Sinha of raping her, killing her father

Ex-Bigg Boss contestant, Pooja Misra, Salman Khan Brothers, Shatrughan Sinha, rape, sultan movie shooting, Telugu news

https://www.instagram.com/p/Bowv5fZHEvX/?utm_source=ig_embed