కింగ్‌మేకర్ దుష్యంత్‌కు మాజీ జవాను షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

కింగ్‌మేకర్ దుష్యంత్‌కు మాజీ జవాను షాక్

October 26, 2019

Ex BSF Jawan Tej Bahadur Yadav Comment On Dusyanth

హరియాణా రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా అవతరించిన జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలాకు ఆ పార్టీ నేత మాజీ ఆర్మీ జవాను ఊహించని షాక్ ఇచ్చాడు. బీజేపీకి ఆయన మద్దతు తెలపడాన్ని వ్యతిరేకిస్తూ..పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. హర్యానా ప్రజలను దుష్యంత్ చౌతలా దారుణంగా మోసం చేశారని తేజ్ బహదూర్ యాదవ్ ఆరోపించారు. జేజేపీ.. బీజేపీకి బి-టీమ్ అంటూ మండిపడ్డారు. ఆయన విడుదల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.  

మాజీ జవాను తేజ్ బహదూర్ యాదవ్ గతంలో సరిహద్దుల్లో జవాన్లకు పాడైపోయిన ఆహారం ఇస్తున్నారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలతో ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించారు. అప్పుడు బయటకు వచ్చిన ఆయన రాజకీయాల్లోకి వచ్చి జేజేపీ తరుపున సీఎం మనోహర్ లాల్ కట్టర్‌‌పై పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మెజార్టీ లేకపోవడంతో దుష్యంత్ బీజేపీ వైపు మొగ్గుచూపారు. దీన్ని వ్యతిరేకించిన మాజీ జవాను తీవ్ర ఆరోపణలు చేడం విశేషం.