Ex-girlfriend Somy Ali Sexual Predator Allegations On Salman Khan
mictv telugu

పాకిస్తాన్ అమ్మాయిపై లైంగిక వేధింపులు.. సల్మాన్ ఖాన్ పై సంచలన ఆరోపణలు

December 3, 2022

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు సోమీ అలీ తన మాజీ భాగస్వామిపై విరుచుకుపడింది. పాకిస్తాన్ చెందిన ఈ హీరోయిన్ సల్మాన్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసి మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తామిద్దరం సహజీవనంలో ఉన్నప్పుడు సల్మాన్ తనని లైంగిక వేధించేవాడని సోమీ ఆరోపించింది. సల్మాన్ ఖాన్ తన సినిమాలకు ఎంత ప్రజాదరణ పొందాడో.. లవ్, ఎఫైర్స్, బ్రేకప్స్‌తోను అంతే క్రేజ్ దక్కించుకున్నాడు. సంగీతా బిజ్లానీ, సోమీ అలీ, ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ ఇలా సల్మాన్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ చాలా పెద్దది. అయితే బ్రేకప్ అయ్యాకా.. మిగతావారు ఎవ్వరూ తిట్టని విధంగా ఈ పాకిస్తాన్ హీరోయిన్ సోమీ అలీ లైంగికపరమైన ఆరోపణలు చేసింది.

1993లో అవతార్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోమీ అలీ ఆ టైంలోనే సల్మాన్‌కు దగ్గరైంది. దాదాపు ఎనిమిదేళ్లు వీరిద్దరూ ముంబైలో సహజీవనం చేశారు. అయితే డేటింగ్ ముగిసిన 22ఏళ్లకు నోరు విప్పింది సోమీ అలి. ” సల్మాన్ ఒక ఉన్మాది.. ఉమెన్ బీటర్.. తనని ఎన్నోసార్లు సిగరెట్‌తో కాల్చాడు.. లైంగికంగా వేధించాడు.. అంటూ ఇన్ స్టాగ్రాం‌లో సంచలన పోస్ట్ పెట్టింది సోమీ అలి. అయితే సోమీ అలీ కొద్దిసేపటికే ఇన్‌స్టా పోస్ట్ డిలీట్ చేసినా అప్పటికే అది వైరల్‌గా మారింది. సోమీ అలీ అమెరికాలో సెటిల్ అయ్యింది. 1997 లోనే బాలీవుడ్ కి గుడ్ బై చెప్పి అమెరికా వెళ్లిపోయింది.