Ex-Khammam MP Ponguleti sensational comments
mictv telugu

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

January 1, 2023

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్బంగా ఆత్మీయులతో కలిసి నిర్వహించిన వేడుకలో పొంగులేటి మాట్లాడుతూ.. ” గడిచిన 4 ఏళ్లలో ఏం జరిగింది, ఏం ఇబ్బంది జరిగింది. ఎందుకు జరిగింది అన్న విషయం మనకి తెలియంది కాదు. ఈనాడు మనం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీలో మనకు జరిగిన గౌరవం ఏంటీ ? భవిష్యత్తులో జరగబోతున్నా గౌరవం ఏంటీ ? అన్నది ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ వేదిక మీద ఉన్న, వివిధ నియోజకవర్గాల్లో ఉన్న ముఖ్య నాయకులందరూ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతారు. ప్రజలు చేత దీవించ బడే ప్రతి ఒక్క నాయకుడు తప్పకుండా ఎన్నికల బరిలో ఉంటారు. మిగతా విషయాలు సమయం వచ్చినప్పుడు చెబుతా.. కార్యకర్తలు కోరుకున్నది తప్పకుండా చేసి చూపిస్తాం. రాజకీయాలకు ఇది వేదిక కాదు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను ” అని వ్యాఖ్యానించారు.

కొన్నిరోజులుగా పొంగులేటి బీఆర్ఎస్‎ను వీడుతారనే ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పట్టు ఉన్న పొంగులేటిని తమ పార్టీలో తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలో పొంగులేటి చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పటికే పొంగులేటి తాను పోటీ చేసే స్థానం పైన ప్రకటన చేసారు. ఖమ్మం , కొత్తగూడెం, పాలేరులోని ఏదో స్థానం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేసారు. అయితే పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు లేదా వామపక్షాలు, ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్ బరిలో ఉండటంతో.. ఆయనకు మిగిలింది కొత్తగూడెం ఒక్కటేనని వార్తలు వినిపిస్తున్నాయి.మరోవైపు కేసీఆర్ కూడా సిట్టింగ్‎లకే సీట్లు అని ప్రకటించడంతో ఎంపీగానే పొంగులేటి బరిలో ఉంటారని భావిస్తున్నారు. దీంతో పొంగులేటి బీఆర్ఎస్‎ను వీడుతారని చర్చ మొదలైంది.