మాజీ మంత్రి ముత్యం రెడ్డి కన్నుమూత.. కేసీఆర్, హరీష్‌రావు సంతాపం
మాజీ మంత్రి శ్రీ చెరుకు ముత్యంరెడ్డి గారి మరణం దురదృష్టకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మంత్రిగా, ఎమ్మేల్యేగా ప్రజలకు వారు చేసిన సేవలు గొప్పవి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలుపుతున్నాను. pic.twitter.com/MyLh41VZqb
— Harish Rao Thanneeru (@trsharish) September 2, 2019
టీఆర్ఎస్ నేత మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కన్నుమూశారు .కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సిద్ధిపేటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సీఎం కేసీఆర్, హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొప్పనాయకుడిని కోల్పోయామంటూ పేర్కొన్నారు. ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
సర్పంచ్‌గా రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభిచిన ఆయన మంత్రి వరకు ఎదిగారు. దుబ్బాక, దొమ్మాట నియోజకవర్గాల నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించిన ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన పార్టీలో చేరిన కొద్దిరోజులకే కన్నుమూయడం బాధాకరమని హరీష్ రావు ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఆకాంక్షించారు.