మాజీ మంత్రి కన్నుమూత.. వైసీపీలో విషాదం - MicTv.in - Telugu News
mictv telugu

మాజీ మంత్రి కన్నుమూత.. వైసీపీలో విషాదం

August 10, 2020

EX Minister Penmetsa Sambasiva Raju No More .

వైసీపీ కీలక నేత,మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు. సోమవారం ఉదయం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్టుగా ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చికిత్స తీసుకుంటున్నారు. ఆయన మరణం పట్ల సీఎం జగన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పెనుమత్స మరణం ఉత్తరాంధ్రలో కీలక లోటుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. 

1958లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన, రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుత ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు రాజకీయ గురువుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ కీలక సేవలను అందించి.. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. విజయనగరం రాజకీయాల్లో ఆయన  అరుదైన ముద్ర వేసుకున్నారు. 1967,1972,1978,1983,1985,1989,1999, 2004 సమయంలో గజపతినగరం, సతివాడ నియోజకవర్గాల నుంచి గెలిచారు. నేరురుమల్లి జనార్దనరెడ్డి మంత్రివర్గంలో పని చేశారు.